Chandrababu : బాబాయ్ హత్య కేసు విచారణ పక్క రాష్ట్రానికా? సీఎంగా ఉండి కూడా..-tdp leaders respond on ys viveka murder case investigation transfer to telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Leaders Respond On Ys Viveka Murder Case Investigation Transfer To Telangana

Chandrababu : బాబాయ్ హత్య కేసు విచారణ పక్క రాష్ట్రానికా? సీఎంగా ఉండి కూడా..

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 03:06 PM IST

YS Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేయడంపై టీడీపీ స్పందించింది. సీఎం జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కుడా.. బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి బదిలీ అవుద్దా అని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు (ఫైల్ ఫొటో)
చంద్రబాబు (ఫైల్ ఫొటో) (twitter)

వివేకా హత్య కేసుపై టీడీపీ(TDP) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ హత్య కేసు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా.. పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందని చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. విచారణను తెలంగాణ(Telangana)కు బదిలీ చేయడంతో సీఎం జగన్ తలెక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ మాత్రం నైతికత ఉన్నా.. సీఎం జగన్(CM Jagan) వెంటనే రాజీనామా చేయాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

బాబాయ్‌ని హత్య చేసింది అబ్బాయేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి వెళ్లిందని, అబ్బాయ్ కూడా చంచల్ గూడ జైలుకి వెళ్తాడని ట్వీట్ చేశారు.

వివేకా హత్య కేసు(Viveka Murder Case) విచారణ ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రభుత్వ ప్రతిష్ఠ, పోలీస్ శాఖ(Police Department)కు మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఏ మాత్రం నైతికత ఉన్నా.. సీఎం జగన్ రాజీనామా చేయాలన్నారు.

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్​.. హంతకుల పక్షాన ఉన్నారని.. ఆ విషయాన్నే వివేకా కుమార్తె సునీతతో పాటు సొంత చెల్లెలు షర్మిల అన్నారని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. కేసు విచారణ తెలంగాణ(Telangana)కు బదిలీ చేయడంపై సీఎం జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు. హత్య కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేశారని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని బహిర్గతం చేసినట్టైందని బొండా వ్యాఖ్యానించారు. పథకం ప్రకారమే గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చారని ఆరోపించారు.

2019 మార్చిలో సొంతింటిలో వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మార్చాలని వివేకా కుమార్తె, సతీమణి చేసిన విజ్ఞప్తి సుప్రీం కోర్టు సానుకూలంగా తీర్పు వెలువరించింది. పిటిషననర్లు వెలువరించిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయని అభిప్రాయ పడిన ధర్మాసనం కేసు దర్యాప్తు ఫైల్స్‌ను వీలైనంత త్వరగా జిల్లా కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేస్తూ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు ఏపీలో జరిగితే న్యాయం జరగదని వివేకా కుమార్తె, సతీమణి వ్యక్తం చేసిన ఆందోళన సరైనదనే భావిస్తున్నామని, అందుకే హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మారుస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

IPL_Entry_Point