MP Gorantla Video Issue : లోక్‌సభకు గోరంట్ల మాధవ్ వీడియో ఇష్యూ.. స్పీకర్‌కు ఫిర్యాదు
గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అశ్లీల వీడియో వివాదం లోక్‌సభకు చేరింది. ఈ విషయంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.
న్యూడ్ వీడియో విషయంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఎంపీలుగా సభా మర్యాదలు పాటించడం తమ బాధ్యత అని చెప్పారు. ఆ వీడియోను చూసి భవిష్యత్తులో మరో ఎంపీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని స్పీకర్‌ను అభ్యర్థించారు.
చర్యలు తీసుకుంటామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని రామ్మోహన్ ఆరోపించారు. వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదని పేర్కొన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోనప్పుడు సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. మహిళా సంరక్షణ, గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి పార్లమెంట్ మర్యాదలను కాపాడాలని లేఖ ద్వారా స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని రామ్మోహన్ చెప్పారు. ఈ ఘటనను సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత వ్యవహారంగా అభివర్ణించడంపై రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోరంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
వైసీపీ ఎంపీకి సంబంధించిన ఓ వీడియో ఏపీలో వైరల్ అయింది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అది అసభ్యకరంగా ఉంది. ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ తీరుపై తీవ్ర ఆగ్రహం మెుదలైంది. నెటిజన్లు మండిపడ్డారు. ఎంపీ పదవిలో ఉండి.. ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు.. ప్రభుత్వం విచారణ చేస్తున్నట్టుగా తెలిపింది.
అయితే ఈ న్యూడ్ కాల్ వివాదంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కావాలనే తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆశ్లీల వీడియో వెనక.. టీడీపీకి చెందిన వంశీ, విజయ్, శివకృష్ణ ఉన్నారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలి. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ‘నేను జిమ్ చేసే టైమ్ లో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేశారు. ఆ తర్వాత.. చెత్త వీడియోలను తయారు చేయించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను.'గోరంట్ల మాధవ్ అన్నారు.