Tirumala Tickets: శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం-srivani tickets started again for tirumala darshan on offline mode check full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Srivani Tickets Started Again For Tirumala Darshan On Offline Mode Check Full Details Here

Tirumala Tickets: శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 08:37 PM IST

TTD Latest News:తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభమైంది. ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన జారీ చేసింది.

తిరుమల దర్శనం టికెట్లు
తిరుమల దర్శనం టికెట్లు

Tirumala Tirupati Devasthanam Updates: తిరుమల శ్రీవాణి టికెట్ల విషయంలో భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని పునఃప్రారంభించింది.ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు ఇవ్వనున్నారు. మార్చి నుంచి 500 ఆన్‌లైన్, 400 తిరుమలలో, 100 విమానాశ్రయంలో అందజేయనున్నారు. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.

మార్చి నుంచి 1000 శ్రీవాణి టిక్కెట్లలో... 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

ఇక రానున్న మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్‌లైన్ కోటాను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేసింది టీటీడీ. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నాయి. ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 24 ఉదయం 10గంటల వరకు ఉంటుంది. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది.

బుకింగ్ ప్రాసెస్….

టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. బుకింగ్ ప్రక్రియ.. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

టీటీడీ దేవస్థానమ్స్ అనే మొబైల్ అప్లికేషన్‌ ద్వారా కూడా వివిధ రకాల సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజీని వాడుతున్నారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం