Father and Son Death : కన్నిళ్లు తెప్పించే ఘటన ఇది.. ఓ దగ్గర తండ్రి.. మరో దగ్గర కుమారుడు
Kurnool Father and Son Death : ఒక్కోసారి విధి ఎలా పలకరిస్తుందో తెలియదు. చూస్తుండగానే విషాదం కుటుంబంలోకి వచ్చేస్తుంది. తీర్చుకోలేని నష్టాన్ని మిగిల్చి వెళ్తుంది.
ఒకే కుటుంబంలో ఇద్దరూ ఒకేసారి మరణిస్తే ఎంతటి బాధ. ఆ కుటుంబానికి తీరని దు:ఖం మిగులుతుంది. ఇంట్లో పెద్దదిక్కు అనుకునే వాళ్లు చనిపోతే.. ఇక ఆ కుటుంబాన్ని ఎంత ఓదార్చిన తీరని బాధ. తండ్రి మరణించాడని తెలిసిన కాసేపటికే... ఎక్కడో ఉన్న కుమారుడు కూడా చనిపోయాడని తెలిస్తే.. ఆ ఫ్యామిలీ బాధ వర్ణించలేనిది. అలాంటి ఘటన కర్నూలు జిల్లా(Kurnool District)లో జరిగింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు(yemmiganur) పట్టణం ఎస్ ఎంటీ కాలనీకి చెందిన మాదేశ్ కు 65 ఏళ్లు, రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి జగదీశ్(32) అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎలాగోలా కుంటాబాన్ని నెట్టుకొస్తున్నారు . ఉన్నదాంట్లో తింటూ బతుకును నడిపిస్తున్నారు.
హైదరాబాద్(Hyderabad)లో జగదీశ్ సెంట్రీ పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అతడిక భార్య రాధ ఉంది. అక్టోబర్ 25వ తేదీన ఎమ్మిగనూరుకు వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు జగదీశ్. అయితే అతడిని మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ లోని ఓ ఆసుత్రిలో జాయిన్ చేశారు. కుమారుడికి రోడ్డు ప్రమాదం గురించి తెలిసి.. మాదేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడూ కొడుకు ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఉండేవాడు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.
అయితే కుమారుడి ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి.. మాదేశ్ భార్య బేబీ హైదరాబాద్ లో ఉంది. భర్త చనిపోయాడని తెలిసి.. ఎమ్మిగనూరుకు చేరుకుంది. అయితే తండ్రి అంత్యక్రియలు మగిశాయి. కాసేపటికే కుమారుడు జగదీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు. బీపీ, షుగర్ పెరిగినట్టుగా వైద్యులు చెప్పారు. జగదీశ్ భార్య రాధ.. మృతదేహాన్ని తీసుకుని ఎమ్మిగనూరు వచ్చింది. ఒకే రోజు తండ్రి కుమారుడు మృతి చందడంతో ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది.