Perni Nani Fires On Pawan : పూటకో పార్టీతో మూడు ముక్కల రాజకీయం పవన్‌దే…పేర్ని-ex minister perni nani fires on jana sena pawan kalyan public meeting in srikakulam district rana stalam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Minister Perni Nani Fires On Jana Sena Pawan Kalyan Public Meeting In Srikakulam District Rana Stalam

Perni Nani Fires On Pawan : పూటకో పార్టీతో మూడు ముక్కల రాజకీయం పవన్‌దే…పేర్ని

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 06:47 AM IST

Perni Nani Fires On Pawan పవన్ కళ్యాణ్ యువశక్తి సభతో ప్రయోజనం ఎవరికని, పవన్ చేసేది రాజకీయ వ్యభిచారం కాకపోతే మరేమిటని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పవన్ సభలో పరనింద తప్ప మరొకరి లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ లక్ష్యంగా రణ స్థలం యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడంతో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు.

మాజీ మంత్రి పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani Fires On Pawan రణస్థలంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టడానికే పవన్ కళ్యాణ్ సభ పెట్టినట్లున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. యువత కోసం సభ అనేది అబద్ధమని చంద్రబాబు సంకలోకి ఎక్కుతున్నా అని చెప్పడానికే సభ మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తిరుగుబోతు అని, తనను నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పవన్, చంద్రబాబు కలిసి నడిపిన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీ ఉన్న ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా...ఆరాటమా అని నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు

గ్లాసుతో టీ తాగి ఫ్యాన్‌కి ఓటేశారని కార్యకర్తలనే నమ్మనంటున్నాడని, తనకు భయం లేదని అన్ని సార్లు చెప్పాడంటే భయపడుతున్నట్లేనన్నారు. కాపులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణే అని, మంత్రి రోజా టీడీపీతోొ ధైర్యంగా పోరాడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మంత్రిగా చేస్తోందని, పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడని, అదీ అతని స్థాయి అన్నారు.

ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి నింపుతానని, ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఓ నెల రోజుల నుంచి చెప్తూ చెబుతూ నిర్వహించిన సభలో మధ్యాహ్నం 12 గంటల నుంచి యువత వేచిఉంటే రాత్రికి ఆత్మస్థుతి, పరనింద పారాయణం చేశాడని విమర్శించారు. మైకు దొరికిందని, మూడు నాలుగు వేల మంది ముందు కూర్చున్నారని, టీవీలన్నీ చూపిస్తాయని పవన్ ఏదేదో వాగుతున్నాడని, ఏరా ఓరే అంటూ మాట్లాడటం కుసంస్కారం కాక ఏమంటారని ప్రశ్నించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను అసభ్య పదజాలంతో మాట్లాడటం, వ్యక్తత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం తప్ప ఆ సభ వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. చివరికి నమ్మి వచ్చిన జనసేన కార్యకర్తలకు కూడా ఆ సభ వల్ల ఉపయోగం లేదని, రాష్ట్రం నలుమూలల నుంచి సినిమా పిచ్చితో నమ్మి అక్కడకు వచ్చిన వారినికూడా తాను నమ్మను అని అంటున్నాడన్నారు. నా కులపోడు, చుట్టం, స్నేహితుడంటూ మీరు వేరే వారికి ఓటు వేస్తారు అంటూ సభకు వచ్చిన వారిని తిడతాడని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనంటే మీరు ఎలాగూ ద్వేషిస్తారు..చివరికి నిన్ను నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడని, జగన్మోహన్‌రెడ్డి అంటే పవన్‌కు ఎంత ద్వేషం, అసూయ, ఈర్ష లేకపోతే మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటాడా అన్నారు.

సొంత పార్టీ పెట్టి బీజేపీ, టీడీపీతో అంటకాగాడని, తూచ్‌ అని చంద్రబాబు, ఆయన కొడుకును బూతులు తిట్టి రెండో ముక్కగా అంటకాగింది ఆయనే అని, ఇప్పుడు మూడో ముక్కగా చంద్రబాబుతో తయారుగా ఉన్నాడని ఇక మూడు ముక్కల రాజకీయం చేసేది పవన్‌ కళ్యాణే అని ఆఱోపించారు. సినిమా కవులో, డైరెక్టర్లో రాసిచ్చిన డైలాగులు చదివే నువ్వు జగన్‌ గురించి సంధి ప్రేలాపణలు మాట్లాడుతున్నాడని, పవన్‌ చేసే దాన్ని రాజకీయ వ్యభిచారం అనక ఏమంటారన్నారు.

ఒక పక్క బీజేపీతో మైత్రి బంధం అంటూనే పక్కచూపులు, కన్ను కొట్టుడు, కాలు గీటుడు చంద్రబాబుతో చేస్తున్నారని, దీన్ని రాజకీయ వ్యభిచారం అనక మరేమంటారన్నారు. ఈ రకమైన బరితెగింపు రాజకీయాలు చేసే వ్యక్తి దేశంలో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే అన్నారు. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు, పవన్ కలిసి ప్రభుత్వం నడిపారని అప్పట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి అన్నారు.

వేదికపై మరో కులం ఎందుకు లేదు….

అధికారం లేకపోయినా ఏదైనా చేయొచ్చు అన్న పవన్ కళ్యాణ్‌, మరి ఉద్దానాన్ని ఎందుకు ఉద్దరించలేకపోయావో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులు కనిపించలేదా..? జెట్టీ కట్టించాలని అప్పుడు తెలియలేదా అన్నారు. అప్పట్లోనే శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఎందుకు కట్టించలేదని, పవన్ కలలు కంటుంటే ఆల్‌ రెడీ పనుల్లోకి వెళ్లిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

కాపులను, మత్స్యకారులను, బీసీలను మోసం చేసి కులాలు లేవని మాట్లాడుతున్నాడని, పవన్ సభలో వేదికపై రెండు కులాల వారే ఎందుకు ఉన్నారన్నారు. రాజకీయం అంతా మూడు కులాలు మధ్యనే తిరుగుతోంది అంటున్న పవన్ సభలో వేదికపై ముగ్గురే ఎందుకున్నారని ప్రశ్నించారు. ఇద్దరు కాపులు, ఒక కమ్మ తప్ప మరో కులం దొరకలేదా అని నిలదీశారు. మీరు లేచి వారిని ఎందుకు కూర్చోబెట్టలేదని, కుర్చీలు వేసే మనసు కూడా మీకు రాలేదన్నారు.

చంద్రబాబు పవన్‌ ఏం మాట్లాడుకున్నారో రాష్ట్రమంతా తెలుసని, దానికి ఇంటిలిజెన్స్‌ వారిని అడగాల్సిన అవసరం లేదన్నారు. రెండు రాజకీయ పార్టీల అధ్యక్షులు కూర్చుంటే దేశం బాగోగుల గురించి మాట్లాడుకోవాల్సి ఉందన్నారు. బీజేపీతో అంటకాగి ఐదేళ్లు ప్రజల్ని మోసం చేశాం అని మాట్లాడుకోవాల్సి ఉందని, అంబటి రాంబాబు గురించి 27 నిమిషాలు, ఐటీ శాఖ మంత్రి గురించి 38 నిమిషాలు మాట్లాడుకున్నారట. హోం మంత్రి గురించి 22 నిమిషాలు మాట్లాడుకున్నారట, ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయాలు ఏముంటాయన్నారు.

మీ ఇంట్లో వాళ్లు నటించడం లేదా…..

ఒక సినిమా మాజీ నటి, కళాకారురాలిని సినిమాల్లో నటించిందని ఎంత దిగజారి మాట్లాడావని పేర్ని నాని మండిపడ్డారు. మీ ఇంట్లో ఆడవారు సినిమాల్లో నటించలేదా..? వారి పట్ల కూడా ఇదే అభిప్రాయమా అని నిలదీశారు. సినిమాల్లో నటిస్తున్న ఆడవారిపై నీకున్న కుసంస్కారం, తప్పుడు బుద్ధి ఈ రోజు సభాముఖంగా స్పష్టమైందన్నారు. నీ మనసులో ఉన్న భావాన్ని, వ్యక్తిత్వాన్ని బయట పెట్టావన్నారు. పవన్ నైజాన్ని సమాజం చూస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

రోజా ఏం తప్పుడు పనిచేసిందని, . సినిమాల్లో నటిస్తే చులకనా అని నిలదీశారు. మీ ఇంట్లోకూడా నటిస్తున్నారు కదా అని, నీ వయసంతా...నీ పక్కన నటిస్తున్న వారి వయసెంత అని ప్రశ్నించారు. వేదికలెక్కితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌కు ఇంత కుసంస్కారం ఎందుకన్నారు. తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడే నిన్న మా వాడివి అని చెప్పుకోడానికే సిగ్గేస్తుందన్నారు. రోజా దమ్ముగా రెండు సార్లు జనంలో గెలిచింది. నీలాగా రెండు చోట్లా ఓడిపోలేదన్నారు. దమ్ముగా పదేళ్లు శాసన సభ్యురాలిగా చేసి రాష్ట్రంలో మంత్రిగా చేస్తోందని, సిగ్గు శరం లేకుండా ఆడవారి గురించి నీచంగా మాట్లాడతావా అన్నారు.

జనసేన జెండా మోసే కార్యకర్తలను పవన్ నమ్మడం లేదని, నేను చంద్రబాబుతో వెళ్లిపోతున్నాను...టాటా గుడ్‌ బై అని చివరిగా చెప్పాడని, చంద్రబాబు సంకలో ఎక్కినా కూడా మీరంతా నన్ను నమ్మండి అంటున్నాడని, ఇప్పటికైనా ముసుగు తీసినందుకు ధన్యవాదాలు అని పేర్ని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ ఇన్నాళ్లకు ఒక మంచి పనిచేశాడని ముసుగు తీసి తాను చంద్రబాబు మనిషినని స్పష్టం చేశాడన్నారు. ఇక నుంచైనా ఆయన నోటి జాడింపు మానుకుంటే మంచిదని, మానుకోకపోతే నా దగ్గర కూడా రెండు చెప్పులు ఉన్నాయని, నేను కూడా తీయగలనన్నారు.

IPL_Entry_Point