Telugu News  /  Andhra Pradesh  /  Chinna Sesha Vahana Seva At Tirumala Brahmotsavam 2022
చిన్న శేష వాహన సేవ,
చిన్న శేష వాహన సేవ, (facebook)

Tirumala Brahmotsavam: వైభవంగా చిన్నశేషవాహన సేవ.. దర్శించుకున్న సీఎం జగన్

28 September 2022, 11:31 ISTHT Telugu Desk
28 September 2022, 11:31 IST

Tirumala Brahmotsavam Updates : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు.

Chinna Sesha Vahana Seva at Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులవిందుగా కొనసాగుతున్నాయి. తిరువీధుల్లో చిన్న శేష వాహన సేవను వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు దర్శనం ఇచ్చారు.చిన్న శేషవాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

పరకామణి భవనం ప్రారంభం…

తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పరకామణి భవన సముదాయంతో పాటు లక్ష్మీవీపీఆర్‌ రెస్ట్‌ హౌస్‌ను ప్రారంభించారు. ఇక నుంచి భక్తులు హుండీ కానుకల లెక్కింపును వీక్షించవచ్చు. భక్తులు వీక్షించేలా పరకామణి భవనానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు.

<p>నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌</p>
నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి మంగళవారం పట్టువ్రస్తాలు సమర్పించారు. ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు.

<p>శ్రీవారి సన్నిధిలో సీఎం జగన్</p>
శ్రీవారి సన్నిధిలో సీఎం జగన్ (HT)

ఇవాళ సాయంత్రం 7గంటలకు శ్రీవారు సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కలిగిస్తాడని భావిస్తారు.

గాయత్రీదేవి అలంకారం…

devi navaratrulu 2022: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.