Odisha Train Accident: ఏపీ మీదుగా వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు - ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే-cancellations and diversion rescheduling of trains due to howrah express derailed check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Cancellations And Diversion Rescheduling Of Trains Due To Howrah Express Derailed Check Full Details Are Here

Odisha Train Accident: ఏపీ మీదుగా వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు - ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే

భారీగా రైళ్ల రద్దు
భారీగా రైళ్ల రద్దు

South Central Railway Updates: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.

South Central Railway Latest News: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం కారణంగా భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

విజయవాడ - రాజమండ్రి

రాజమండ్రి - విజయవాడ

రాజమండ్రి - విశాఖపట్నం

విశాఖపట్నం - రాజమండ్రి

కాకినాడ పోర్టు - విశాఖపట్నం

విశాఖపట్నం - కాకినాడ పోర్టు

విజయవాడ - కాకినాడ పోర్టు

గుంటూరు - విశాఖపట్నం

విశాఖపట్నం - విజయవాడ

విజయవాడ - విశాఖపట్నం

ఇక విశాఖపట్నం - గుంటూరు, దన్ బాద్- అలెప్పీ, టాటా నగర్ - బెంగళూరు, హటియా - బెంగళూరు మధ్య నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), హావ్‌డా-హైదరాబాద్‌(18045), హావ్‌డా-తిరుపతి(20889), హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు:

రైల్ నిలయం, సికింద్రాబాద్ - 040 - 27788516

విజయవాడ రైల్వే స్టేషన్ - 0866 - 2576924

రాజమండ్రి రైల్వే స్టేషన్ - 0883 - 2420541

రేణిగుంట రైల్వే స్టేషన్ - 9949198414.

తిరుపతి రైల్వే స్టేషన్ - 7815915571

ఒడిశా వద్ద కోరమాండల్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

- ఒడిశా,బాలసోర్ 06782-262286

-విజయవాడ - 0866 2576924

-రాజమండ్రి - 08832420541

-సామర్లకోట - 7780741268

-నెల్లూరు - 08612342028

-ఒంగోలు -7815909489

-గూడూరు -08624250795

-ఏలూరు -08812232267

రద్దు అయిన రైళ్ల వివరాలు
రద్దు అయిన రైళ్ల వివరాలు
WhatsApp channel

సంబంధిత కథనం