AP Govt Jobs: 14వేలకు పైగా పోస్టులు.. ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌! -ap village secretariat job notification will be released in february 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs: 14వేలకు పైగా పోస్టులు.. ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌!

AP Govt Jobs: 14వేలకు పైగా పోస్టులు.. ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌!

HT Telugu Desk HT Telugu
Jan 15, 2023 07:54 AM IST

grama sachivalayam new notification 2023: ఉద్యోగ అభ్యర్థులకు ఏపీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో సచివాలయ ఉద్యోగాలు
ఏపీలో సచివాలయ ఉద్యోగాలు

Job Notifications in andhrapradesh: ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ సర్కార్ మరో అడుగు ముందుకేసే పనిలో పడింది. ఇప్పటికే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వగా... వచ్చే ఫిబ్రవరి నెలలో సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడ్ అవుతోంది. రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 14 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత... గ్రామ స్థాయిలోనే దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చింది. ఇందుకోసం భర్తీ స్థాయిలో ఉద్యోగాలను రిక్రూట్ చేసింది. రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చి పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా... ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి... ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే... ఏప్రిల్ లోపు రాత పరీక్షలను నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో వివరించింది. ఇప్పటివరకు మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. దీంతో ఏఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత రాగానే... నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

22న కానిస్టేబుల్ పరీక్ష

APSLLPRB Hall Tickets ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాలలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షల నిర్వహణకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 3580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు.కానిస్బేబుల్‌ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌ టిక్కెట్లను https://slprb.ap.gov.in/నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్ చేసుకోడానికి 9రోజులు గడువు ఉన్నట్లు ప్రకటించారు.

IPL_Entry_Point