AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూ్స్, రెగ్యులరైజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్-ap government agrees to regularization contract employees five years service complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Government Agrees To Regularization Contract Employees Five Years Service Complete

AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూ్స్, రెగ్యులరైజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్

Bandaru Satyaprasad HT Telugu
Jun 05, 2023 09:28 PM IST

AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 7న జరిగే కేబినెట్ లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2, 2014 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఒప్పంద ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగే కేబినెట్ లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనుంది. మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఉద్యోగుల సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. పీఆర్సీపీపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించింది. కేబినెట్‌ సమావేశంలో పీఆర్సీపై ప్రకటన విడుదల చేయనున్నారన్నారు. పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ సీఎస్‌ సమీర్‌శర్మ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకించాయి.

ట్రెండింగ్ వార్తలు

పెండింగ్ బిల్లులపై చర్చ

ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం మంత్రిగు ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ ప్రకారం చెల్లించడంతో కాస్త ఆలస్యం జరిగిందన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రూ.2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు మరింత ఆదాయం పెరిగిందన్నారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పనులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ఉద్యోగుల‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఉద్యోగ సంఘాలతో భేటీలో పెండింగ్ బిల్లుపై చర్చ జరిగిందన్నారు. జీపీఎస్‌ విధానంపై ఉద్యోగ సంఘాలకు వివరించామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాత పింఛన్ వల్ల కలిగే నష్టాలు, జీపీఎస్ ఉపయోగాలు తెలియజేశామన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నామన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ

2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందన్నారు. నూతన పింఛన్ విధానంపై కేబినెట్‌లో చర్చించి మెరుగైన విధానం తీసుకొస్తామన్నారు. ఉద్యోగులకు కచ్చితంగా పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

IPL_Entry_Point