YSR Kalyanamastu and Shadi Thofa : రేపటి నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా-ap cm will launch ysr kalyanamastu and shadi thofa schemes today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Kalyanamastu And Shadi Thofa : రేపటి నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా

YSR Kalyanamastu and Shadi Thofa : రేపటి నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 07:09 AM IST

YSR Kalyanamastu and Shadi Thofa ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం క్రితం నిలిచిపోయిన వైఎస్సార్‌ కళ్యాణ్‌ మస్తు, షాదీతోఫా పథకాలను మళ్లీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను నేడు శ్రీకారం చుట్టనున్న సిఎం జగన్
కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను నేడు శ్రీకారం చుట్టనున్న సిఎం జగన్

YSR Kalyanamastu and Shadi Thofa రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

YSR Kalyanamastu షాదీతోఫా పథకాల ద్వారా పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. వివాహాలకు కనీస వయసును నిర్దేశించడంతో పాటు పెళ్లిళ్లకు చదువుతో ముడిపెట్టారు. కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. దీనిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పిల్లల్లో కనీస విద్యార్హత పెంచే లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం లక్ష్యాలుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" Shadi Thofaపథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా Ysr Shadi Thofa ఆర్థికసాయం భారీగా పెంచారు. వైఎస్సార్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్.సి లకు రూ.1,00,000, ఎస్.సి. ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్.టి. లకు రూ.1,00,000, ఎస్.టి ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బి.సి. లకు రూ.50,000, బి.సి. లో కులాంతర వివాహాలకు రూ.75,000, ముస్లిం, మైనారిటీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 లను అందించనున్నారు. చదువును ప్రోత్సహించేందుకు వధూవరులిరువురుకి టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు.

“వైఎస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamastu) ”,“వైఎస్సార్ షాదీ తోఫా (Ysr Shadi Thofa) ” పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలి.

IPL_Entry_Point