Ysrtp Sharmila: కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బూటకమన్న షర్మిల
Ysrtp Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద బూటకమని, ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని కెసిఆర్ మాయ మాటలు చెప్పి మోసం చేశాడని, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు.
Ysrtp Sharmila భారత దేశంలో జరిగిన పెద్దపెద్ద కుంభకోణాల కంటే కాళేశ్వరం పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేసి కెసిఆర్ చేసిన అవినీతి దేశం అంత చూసేలా చేస్తానని చెప్పారు. 18 లక్షలు ఎకరాలకి నీళ్లు ఇస్తా అని చెప్పి లక్షన్నర ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమిషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంత ఇంత అవినీతి జరగలేదని, ఒక్క సంవత్సరం అయినా 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు.
తెలంగాణ అంతటా జల కళ అంటూ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ అసెంబ్లీలోలో గ్లోబల్ ప్రచారం చేశారని, రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తో పాటు ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం మూడింతలు పెంచారని, ️ప్రాజెక్టు చేపట్టిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా దండుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడుగడుగున అవినీతి జరిగిందని, ️రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన పనిలో కూడా క్వాలిటీ లేదని, కాళేశ్వరంలో ప్రాజెక్టులో కేసీఆర్ పెద్ద డిజైనర లాా ఫీల్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ️ లక్ష కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్ట్ పై అప్పు చేసి కట్టారని, తెలంగాణ ప్రజల పన్నులు కట్టిన డబ్బులతో ప్రజల్ని తప్పుద్రోవ పట్టించి కట్టిన ప్రాజెక్ట్‌పై విచారణ అవసరమన్నారు. ️ తెలంగాణ ప్రాజెక్ట్ మూడేళ్లు లో మునిగిపోయిందని, ముఖ్యమంత్రి హోదా తప్ప కేసీఆర్ ఏ అర్హతతో ఇన్ని తప్పులు చేస్తున్నాడని ప్రశ్నించారు.
కాళేశ్వరం కట్టక ముందు ఎవరికీ ఇబ్బంది లేదని, బ్యాక్ వాటర్ వల్ల ఇప్పుడు వేల ఎకరాలకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. ️ తెలంగాణ రాష్టంలో 80 % ప్రాజెక్ట్‌లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని ఆరోపించారు. ️ఆ కంపెనీ ఇచ్చిన ముడుపులు అన్ని ప్రతి పక్షాలకు అందాయని, అందుకే ఆయా పార్టీల నేతలు సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపించారు. ️బీజేపీ కూడా ఇందులో భాగమేనని విమర్శించారు. కాళేశ్వరం లో జరిగిన అవినీతిపై మంగళవారం ఢిల్లీలో పోరాటం చేస్తాననని ప్రకటించారు. ️ తెలంగాణ రాష్టంలో ఉన్న ఎంపీలు కూడా ఈ అంశం లో తనతో పాటు కలిసి రావాలన్నారు. ️ లిక్కర్ స్కాం కవిత కోసం అందరు ఢిల్లీ లో మద్దతు నిలిచారని, బతుకమ్మ ముసుగులో చేసిన స్కాం కి మద్దతు తెలిపిన వారు, కాళేశ్వరం లో జరిగిన అవినీతి పోరాటానికి మద్దతివ్వాలన్నారు.
టాపిక్