Union Minister : ఇక్కడ నమ్మకం పొగొట్టుకున్నాక.. జాతీయ పార్టీని ఎలా నమ్ముతారు-union minister mahendranath pandey comments on cm kcr over national politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Union Minister Mahendranath Pandey Comments On Cm Kcr Over National Politics

Union Minister : ఇక్కడ నమ్మకం పొగొట్టుకున్నాక.. జాతీయ పార్టీని ఎలా నమ్ముతారు

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 08:19 PM IST

తెలంగాణలో నమ్మకాన్ని పోగొట్టుకున్న కేసీఆర్ జాతీయ పార్టీని.. ప్రజలు ఎలా నమ్ముతారని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు.

కేసీఆర్ పై కేంద్రమంత్రి కామెంట్స్
కేసీఆర్ పై కేంద్రమంత్రి కామెంట్స్

నిజామాబాద్ జిల్లాకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసత్య పాలన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహ దీక్షలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

నిజామాబాద్ స్పైస్ బోర్డుకు 30 కోట్లు మంజూరు చేశామని కేంద్రమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల రవాణా కోసం ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామని తెలిపారు. కవిత ఎంపీగా ఉన్నపుడు పసుపు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్న కేంద్రమంత్రి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలమని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సహకరిస్తామని కేంద్రమం వ్యాఖ్యానించారు. అసత్య పాలన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహ దీక్షలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మూతబడిన చక్కెర పరిశ్రమలను తెరుస్తామన్నారు.

టీఆర్ఎస్ వాళ్లు పార్టీ పేరును ఎలాగైనా మార్చుకోనిమ్మండి అని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. కానీ ప్రజలు ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో సరైన పాలన సాగిస్తే చాలు అని హితవు పలికారు. 8 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఇక గద్దె దిగే సమయం వచ్చిందని జోస్యం చెప్పారు. 

మిగిలిన కొద్దిరోజులైనా తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. పార్టీని వారు ఏ రూపంలోనైనా తీసుకువచ్చినా.. దానివల్ల ఒరిగేది ఏం లేదని వ్యాఖ్యానించారు. ముందు రాష్ట్రాన్ని సరిగా పాలించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయబోతున్నామని మహేంద్రనాథ్ పాండే అన్నారు.

IPL_Entry_Point

టాపిక్