TSSPDCL Recruitment 2022 : విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? లేదా?-tsspdcl recruitment 2022 online application process for 201 sub engineer posts to end on 5th july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsspdcl Recruitment 2022 Online Application Process For 201 Sub Engineer Posts To End On 5th July

TSSPDCL Recruitment 2022 : విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? లేదా?

HT Telugu Desk HT Telugu
Jul 04, 2022 05:31 PM IST

టీఎస్​ఎస్​పీడీసీఎల్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు తేదీ జులై 5తో ముగుస్తోంది.

విద్యుత్ ఉద్యోగాలు
విద్యుత్ ఉద్యోగాలు

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై చేసుకోవాలి. జులై 5కో చివరి తేదీగా ఉంది. ముగింపు సమయంలోపు అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్‌ శాఖ తెలిపింది.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు ఇదిగో..

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌(సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌)లో 201 సబ్‌ ఇంజినీర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు డిప్లొమా (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

పోస్టుల పేరు - సబ్ ఇంజినీర్లు(ఎలక్ట్రికల్)

మొత్తం ఖాళీలు: 201

సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) ఎల్‌ఆర్‌ పోస్టులు: 19

సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) జీఆర్‌ పోస్టులు: 182

పే స్కేల్‌: నెలకు రూ. 88,665ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 44 ఏళ్లు

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగానే నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 15, 2022.

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 23, 2022 నుంచి

రాత పరీక్ష తేదీ: జులై 31, 2022.

దరఖాస్తు రుసుం : రూ. 200

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు: రూ.120

పరీక్షా విధానం

ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్‌ ఏ లో మొత్తం 80 ప్రశ్నలు కోర్‌ టెక్నికల్‌ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్‌ బి నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామ్ టైమ్ ను 2 గంటలుగా నిర్ణయించారు.

IPL_Entry_Point

టాపిక్