Hyderabad Traffic Diversion : భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు….
Hyderabad Traffic Diversion తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించ నున్నారు. సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో భాగ్య నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల్ని పరిగణలోకి తీసుకుని ప్రయాణాలకు ప్రణాళిక రూపొందించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఎల్బీస్టేడియంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయన్నారు.
పరిస్థితిని బట్టి ట్రాఫిక్‌ను మళ్లించడం, నిలిపివేయడం చేస్తామని జేసీపీ ప్రకటించారు. బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హమాయత్‌నగర్, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్ల నుంచి నిర్ణీత సమయంలో రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు….
చాపెల్ రోడ్డు, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద మళ్లిస్తారు. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను ప్రెస్‌క్లబ్, ఫ్లై ఓవర్ వైపు అనుమతించరు. ఈ వాహనాలను చాపల్ రోడ్డులోకి ఎస్‌బీఐ వద్ద మళ్లిస్తారు. రవీంద్రభారతి, హిల్‌పోర్టు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించరు. ఈ వాహనాలను సుజాత హైస్కూల్ వైపు కేఎల్‌కే బిల్డింగ్ ఫతేమైదాన్ వద్ద మళ్లిసార్తు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపు అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపల్ రోడ్డులోకి మళ్లిస్తారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో మళ్లిస్తారు. కింగ్‌కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను కింక్‌కోఠి ఎక్స్ రోడ్స్‌లో తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ రూట్‌లోకి మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను కర్బాలా మైదానం వద్ద బైబిల్ హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం,తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను సచివాలం ఓల్డ్‌గేట్ వద్ద తెలుగుతలి ఫ్లై ఓవర్‌పైకి మళ్లిస్తారు.
పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రసాద్ హైమాక్స్ వైపు మళ్లిస్తారు. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్ రోడ్డులో రాణిగంజ్, నెక్లెస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి జంక్షన్, ఎన్టీఆర్‌మార్గ్, ఇక్బాల్ మినార్ వద్ద యూ టర్న్ తీసుకొని తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పైకి మళ్లిస్తారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు….
సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్లే వాహనాలను స్వీకార్ ఉపకార్ జంక్షన్ నుంచి వైఎంసీఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డ, చాదర్‌ఘాట్ రంగమహల్ నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకోవాలి. సిటీ బస్సులను కర్బాల మైదాన్ నుంచి బైబిల్ హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ ఫీవర్ దవాఖాన క్రాస్‌రోడ్స్, బర్కత్‌పుర టూరిస్ట్ హోటల్, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్, రంగమహల్, ఎంజీబీఎస్‌కు చేరుకోవాలి.
పార్కింగ్ ఏరియాలు ఇవే….
వీఐపీ ఆఫీసర్స్ వాహనాలు ఎల్బీ స్టేడియంలోని టెన్నీస్ గ్రౌండ్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాహనాలను ఎస్‌సీఈఆర్‌టీ ఆఫీస్ వద్ద పార్క్ చేయాలి. బస్సులలో వచ్చే ఆహ్వానితులను ఎల్బీ స్టేడియం వద్ద దింపిన తర్వాత, ఆయా బస్సులను నెక్లెస్‌రోడ్డు, బుద్ధ భవన్ వద్ద పార్కు చేసుకోవాలి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో రిజర్వు పార్కింగ్‌లో వాహనాలను పార్కు చేయాలని సూచించారు.