Geetha Arts | గీతా ఆర్ట్స్ ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ అర్ధనగ్న ప్రదర్శన-tollywood junior artist stages half naked protest at geeta arts office ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tollywood Junior Artist Stages Half Naked Protest At Geeta Arts Office

Geetha Arts | గీతా ఆర్ట్స్ ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ అర్ధనగ్న ప్రదర్శన

HT Telugu Desk HT Telugu
May 09, 2022 03:35 PM IST

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ఎదుట ఓ జూనియర్ ఆర్టిస్ట్ అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని ఆమె చెబుతోంది.

గీతా ఆర్ట్స్
గీతా ఆర్ట్స్

జూబ్లిహిల్స్‌ లోని గీతా ఆర్ట్స్ ఎదుట సునీత అనే జూనియర్ ఆర్టిస్ట్.. అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. తనకు డబ్బులు రావాలని.. ఎన్నిసార్లు అడిగినా.. ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. ఈ విషయం పోలీసులకు తెలిసి.. కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న సునీతను.. సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గతంలోనూ.. సునీత గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎందుట నిరసనకు దిగింది.

తనకు జరిగిన అన్యాయంపై నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పందించి న్యాయం చేయాలని సునీత డిమాండ్ చేసింది. గీతా ఆర్ట్స్ ఎదుట ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న సమయంలో ఆఫీస్ లో ఎవరూ లేరు. పోలీసులకు విషయం తెలిసి వచ్చి తీసుకెళ్లారు.

గతేడాది జులై నెలలో కూడా ఇదే తరహాలో గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు చేపట్టింది సునీత. నిర్మాత బన్నీ వాసుపై ఆరోపణలు చేసింది. న్యాయం చేయమని అడిగితే బెదిరిస్తున్నారని చెప్పింది. మలక్‌పేటకు చెందిన సునీత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్