Hyderabad: నగరంలో హార్మోన్ ఇంజెక్షన్ల దందా... జిమ్‌కు వెళ్లే యువకులే వీరి టార్గెట్‌ -three people arrested for illegally selling growth hormone injections in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: నగరంలో హార్మోన్ ఇంజెక్షన్ల దందా... జిమ్‌కు వెళ్లే యువకులే వీరి టార్గెట్‌

Hyderabad: నగరంలో హార్మోన్ ఇంజెక్షన్ల దందా... జిమ్‌కు వెళ్లే యువకులే వీరి టార్గెట్‌

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 12:36 PM IST

Steroid Injections-Tablets Seized in Hyderabad : హైదరాబాద్ నగరంలో సరికొత్త దందా బయటపడింది. అక్రమంగా సరఫరా చేస్తున్న హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, స్టెరాయిడ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

స్టెరాయిడ్స్ దందా
స్టెరాయిడ్స్ దందా

illegally selling growth hormone injections in hyd: వారి టార్గెట్ యూత్..! అందులోనూ జిమ్ కు వెళ్లే వారు మాత్రమే..! తక్కువ సమయంలో కండలు తిరిగిన శరీరాకృతిని పొందవచ్చు అంటూ లైన్ లోకి దింపేలా ప్లాన్ చేస్తారు. ఇందుకోసం కొన్ని ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ అందజేస్తుంటారు. ఇలా ఎంతో మంది యువకులకు సరఫరా చేస్తూ... జేబులు నింపుకుంటున్నారు. వీరి సరికొత్త దందా గురించి సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు... ముఠా గుట్టురట్టు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేయటంతో పాటు ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ను భారీగా స్వాధనం చేసుకున్నారు.

అమీర్‌పేటకు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి సప్లమెంటరీ ప్రోటీన్ వ్యాపారం చేస్తున్నాడు. వీటిని నరేష్ (38) అనే వ్యక్తి సరఫరా చేస్తుంటాడు. అయితే విశాఖపట్నానికి చెందిన ఓం ప్రకాష్ ప్రస్తుతం సనత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను హైదరాబాదులోని కుకట్‌పల్లిలో గతంలో ఫ్రీ లాన్సింగ్ జిమ్ ట్రైనర్‌గా పని చేశాడు. ఇతను గతంలో అమీర్‌పేటలో మజిల్ హౌస్ న్యూట్రిషన్ సప్లమెంటరీ ప్రోటీన్ పేరుతో బిజినెస్ కూడా చేశాడు. అయితే వ్యాపారంలో వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోవటం లేదని.. సింపుల్ గా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మాస్టర్ స్కెట్ వేశాడు. హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలుసుకుని.. వాటిని అవసరమైన కస్టమర్లకు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక ధరకు విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ ఫార్మసీ వ్యాపారంలో ఉన్న విశాఖపట్నంకి చెందిన అవినాష్ అనే చిన్ననాటి స్నేహితున్ని కలిశాడు. తన ప్లాన్ గురించి వివరించాడు. అందుకు అవినాష్ అంగీకరింటంతో.. ఈ ఇద్దరు కలిసి హార్మోన్స్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను అక్రమంగా సరఫరా చేసి అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ నగరంలోని జిమ్ములకు సప్లమెంటరీ ప్రోటీన్లను పంపిణీ చేసే నరేశ్, బేగంబజార్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఫారుక్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంలో ఓం ప్రకాష్ ఆ ఇద్దరితో ఇంజెక్షన్లు, టాబ్లెట్ల గురించి చర్చించాడు. ఆ ఇద్దరు కూడా అంగీకరించారు. సరఫరా చేయడం షూరూ చేశారు. వీరి దందాపై సమాచారం అందుకున్న ఎస్సాఆర్ నగర్ పోలీసులు.... సోదాలు చేపట్టారు. నగరంలో 80కిపైగా జిమ్ లకు సంబంధించి వీరికి కాంటాక్టులున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన అవినాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో 120 - Duradexx - 250 Mg ఇంజెక్షన్లు, 60 - C_Ject - 250 Mg ఇంజెక్షన్లు, 500 - Stormbear -10 Mg మాత్రలు, 500 - Airclen - 40 Mg మాత్రలు, 100 - Debolon -10 mg మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారు..? నగరంలోని జిమ్ సెంటర్ల పాత్ర ఏమైనా ఉందా..? వంటి కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి ఇంజెక్షన్లు, మాత్రలను తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. వీటి ఫలితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచించారు.

IPL_Entry_Point