Telugu News  /  Telangana  /  Temperatures Drop In Telangana Imd Issued Yellow Alert To These Districts
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Telangana Weather : మరో వారం రోజులు మస్తు ఇగం..

20 December 2022, 15:43 ISTHT Telugu Desk
20 December 2022, 15:43 IST

Telangana Weather News : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని రోజులు ఇలానే కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

కొన్నిరోజులుగా తెలంగాణ(Telangana)లో చలి పెరుగుతోంది. మరో వారం రోజులపాటు ఇలానే కొనసాగనుంది. ఉష్ణోగ్రతలు(temperature) పడిపోనున్నాయి. దీంతో ఐఎండీ(IMD) అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంలో ఉదయం గాలులతో కూడిన వాతావరణం ఉంది. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చలి తీవ్రత కొనసాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

రాజేంద్రనగర్‌(Rajendranagar)లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.9 డిగ్రీలు, రాష్ట్రంలోని మెదక్‌లో 11 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలో వచ్చే వారం పొడి వాతావరణం ఉండనుంది. అయితే తెలంగాణలోని చాలా నగరాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్(IMD Orange Alert), ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.

5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నందున ఆదిలాబాద్(Adilabad), కుమురం భీమ్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, వికారాబాద్, హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది . వచ్చే రెండు రోజుల పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌(Yellow Alert) ప్రకటించారు.

రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్ నగర పరిధిలోని మల్కాజిగిరి, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఎల్‌బీ నగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో ఆకాశం పొగమంచు లేదా పొగమంచుతో చాలా స్పష్టంగా ఉంటుంది. తదుపరి 48 గంటల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.