TS Govt: రాష్ట్రంలో మరిన్ని కొత్త మండలాలు - వివరాలివే-telangana govt issued orders for formations of new mandals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt: రాష్ట్రంలో మరిన్ని కొత్త మండలాలు - వివరాలివే

TS Govt: రాష్ట్రంలో మరిన్ని కొత్త మండలాలు - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 03:27 PM IST

new mandals in telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పలు మండలాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త మండలాలు ఏర్పాటుకు ఉత్తర్వులు
కొత్త మండలాలు ఏర్పాటుకు ఉత్తర్వులు

telangana govt orders on new mandals:పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా కొత్తగా పలు మండలాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ మేరకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.

ఏర్పాటయిన నూతన మండలాలు:

• నారాయణ పేట జిల్లా/ రెవెన్యూ డివిజన్ పరిధిలో - గుండుమల్ (Gundumal), కొత్తపల్లె (Kothapalle) మండలాలు

• వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో - దుడ్యాల్ (Dudyal) మండలం

• మహబూబ్ నగర్ జిల్లా/ రెవెన్యూ డివిజన్ పరిధిలో - కౌకుంట్ల (Koukuntla) మండలం

• నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో - ఆలూర్ (Aloor), డొంకేశ్వర్ (Donkeshwar) మండలాలు

• నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో - సాలూర (Saloora) మండలం

• మహబూబాబాద్ జిల్లా/రెవెన్యూ డివిజన్ పరిధిలో - సీరోల్ (Seerole) మండలం

• నల్లగొండ జిల్లా/రెవెన్యూ డివిజన్ పరిధిలో - గట్టుప్పల్(Gattuppal) మండలం

• సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో - నిజాం పేట్ (Nizampet) మండలం

• కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవెన్యూ డివిజన్ పరిథిలో - డోంగ్లి (Dongli) మండలం

• జగిత్యాల జిల్లా/ జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిలో - ఎండపల్లి (Endapally) మండలం, జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో - భీమారం (Bheemaram) మండలం

పైన పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

IPL_Entry_Point

టాపిక్