Lungs Transplant : దేశంలోనే తొలిసారిగా రెండు ఊపిరితిత్తుల మార్పిడి, యశోద వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స-secunderabad yashoda hospital doctors transplant both lungs first time in india ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lungs Transplant : దేశంలోనే తొలిసారిగా రెండు ఊపిరితిత్తుల మార్పిడి, యశోద వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స

Lungs Transplant : దేశంలోనే తొలిసారిగా రెండు ఊపిరితిత్తుల మార్పిడి, యశోద వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స

HT Telugu Desk HT Telugu
Oct 14, 2023 03:48 PM IST

Lungs Transplant Surgery : సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ పేషంట్ కు రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. దేశంలో తొలిసారిగా ఇటువంటి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద వైద్యులు
ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద వైద్యులు

Lungs Transplant Surgery : సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు ఓ పేషంట్ కు అరుదైన రెండు ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. దేశంలో తొలిసారిగా రెండు ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతం చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా యశోద హాస్పిటల్స్ అరుదైన ఘనతను దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా మూర్రయి గూడెంకు చెందిన రోహిత్ రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల అత్యంత విషపూరితమైన పరాక్వైట్ అనే గడ్డి మందు తీసుకోగా కుటుంబ సభ్యులు 23 ఏళ్ల రోహిత్ ను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కాగా పరాక్వైట్ విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో గంటల వ్యవధిలోనే రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు కిడ్నీలు, కాలేయం ఆస్పత్రిలో చేరే లోపే దెబ్బతిన్నాయి.

రోహిత్ కు మెకానికల్ వెంటిలేషన్ పై చికిత్స అందించారు. అనంతరం అదనపు కార్పొరల్ సపోర్ట్ ( ECMO) పై చికిత్స అందించారు. దాదాపు నెల రోజులు ECMO పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నా రోహిత్ ఆరోగ్యంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో " డబుల్ లంగ్ ట్రాన్స్ పలాంటేషన్ " చేయాలని యశోద ఆస్పత్రి వైద్యులు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల అనుమతితో.. " జీవన్ దాన్ " సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అవయవదానం కార్యక్రమంలో భాగంగా బ్రెయిన్ డెడ్ అయిన ఒక దాత నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులు రోహిత్ కు విజయవంతంగా అమర్చారు. అయితే ఇలాంటి మార్పిడి యావత్ ప్రపంచంలో కేవలం కొన్ని అంతర్జాతీయ ఆస్పత్రిలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇది భారతదేశంలోనే తొలిసారి కావడం విశేషం అయితే ఇలా ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 మాత్రమే ఉండగా ఇది 4వ కేసు.

దేశంలోనే తొలిసారి

ప్రపంచంలోనే అరుదైన ట్రాన్స్ ప్లాంటేషన్ ను యశోద ఆస్పత్రి వైద్య బృందం చేయడం పట్ల యశోద గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ తో భారత వైద్య రంగంలో చరిత్ర సృష్టించడం... మన తెలుగు వారికి గర్వకారణమని ఆయన తెలిపారు. ఇప్పటికే అన్నీ అవయవ మార్పిడి కేసులో ముందంజలో ఉన్న యశోద హాస్పిటల్స్ ఈ అరుదైన ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారని కొనియాడారు. ఆసుపత్రిలోని సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ హరి కిషన్ గోనుగుంట్ల మాట్లాడుతూ పల్మనరీ ఫైబ్రోసిస్ సోకిన వ్యాధికి భారతదేశంలో మొదటిసారిగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంగా జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన కేసులు నాలుగు మాత్రమే ఉండగా ఎక్కువ కాలం జీవించి ఉన్న ఏకైక వ్యక్తి తాము డీల్ చేసిన కేసు అని చెప్పుకొచ్చారు. రోహిత్ దాదాపు ఒక నెలపాటు ECMOలో ఉన్నారని ఊపిరితిత్తుల మార్పిడికి ముందు బహుళ రక్త ప్రసరణ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను రోహిత్ శరీరంలో గుర్తించామన్నారు. అంతటి సీరియస్ కేసును కూడా వైద్య బృందం ఎంతో జాగ్రతగా మార్పిడి చేసిందని డాక్టర్ హరి కిషన్ గొనుకుంట్ల అన్నారు.

అరుదైన మార్పిడిని విజయవంతం చేసిన వైద్యులు వీరే

సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ హరి కిషన్ గోనుగుంట్ల, థొరాసిక్, ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్లు డాక్టర్ కె.ఆర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ విమి వర్గీస్ , బృందం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో ఈ ప్రక్రియను విజయవంతం చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

IPL_Entry_Point