Jobs: ఈవెంట్స్ లో ఏం ఉంటాయి.. వాటి అర్హతలేంటి..? మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి-requirements for events in telangana police jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jobs: ఈవెంట్స్ లో ఏం ఉంటాయి.. వాటి అర్హతలేంటి..? మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి

Jobs: ఈవెంట్స్ లో ఏం ఉంటాయి.. వాటి అర్హతలేంటి..? మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Apr 26, 2022 08:42 AM IST

TS Police Recruitment 2022:పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 16,614 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది తెలంగాణ సర్కార్. మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. మరీ ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్షలో పాస్ అయితే సరిపోదు.. ఈవెంట్స్ ఎంతో కీలకం. వాటి అర్హతలు ఏంటో చూస్తే..

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ (twitter)

TS Police Recruitment 2022:  తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. తొలి అడుగు పోలీసు శాఖ నుంచే పడింది. ఈ ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఇంటర్మీడియట్ పూర్తి అయిన వాళ్లు కూడా పోలీసు ఉద్యోగాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. రాతపరీక్షపై కాస్త క్లారిటీ ఉన్నా.. ఈవెంట్స్ పై అనేక డౌట్స్ ఉంటాయి.  ఈవెంట్స్ లో ఎలాంటి టాస్క్ లు ఉంటాయి..? ఫిజికల్ టెస్టులను ఎలా నిర్వహిస్తారు..? వెయిటేజ్ ఎవరికి ఇస్తారు..? వంటి ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి.

తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ లో అన్ని అంశాలను వివరించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, కమ్యూనికేషన్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను కేటగిరీలుగా పేర్కొంది. అయితే వీరికి పరీక్షలు వేర్వురుగా ఉన్నా.. ఈవెంట్స్ మాత్రం ఒకేలా ఉంటాయి. ఇందులో మహిళా అభ్యర్థుల విషయంలో అర్హతలు వేరుగా ఉన్నాయి.

ఈవెంట్స్ లో ఉండేవి ఇవే...

పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు దశల్లో చేపడుతారు. ఒకటి రాత పరీక్ష ఉంటే.. మరోకటి ఈవెంట్స్. ఈవెంట్స్ లో మంచి ప్రతిభ కనబరిస్తే వేయిటేజ్ కూడా ఇస్తారు. అయితే ఈవెంట్స్ విషయానికి వస్తే ప్రతి అభ్యర్థి 800 మీటర్ల రన్నింగ్‌లో తప్పనిసరిగా అర్హ‌త సాధించాల్సిందే.టీఎస్‌ఎస్‌పీ, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్ కేటగిరీ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు అన్ని ఈవెంట్స్‌లో అర్హత తప్పనిసరి. ఇక సివిల్ ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, సివిల్ కానిస్టేబుల్స్, ఫైర్‌మెన్, వార్డర్స్ పోస్టులకు మాత్రం (100 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్) ఈవెంట్స్‌లో రెండిటిలో అర్హత సాధించిన సరిపోతుంది. ఇందులోనూ 100 మీటర్ల పరుగు తప్పనిసరి అనే నిబంధన ఉంది.

సివిల్ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు రాత పరీక్షలో మార్కుల అధారంగా ఎంపిక ఉంటుంది. ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్‌లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు రెండింటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పురుష అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు:

అంశం                                   అర్హత సమయం

100 మీ. రన్నింగ్       -                15 సెకన్లు

షాట్‌పుట్ (7.26 కిలోలు)  -          5.60 మీ.

లాంగ్‌జంప్    -                             3.80 మీ.

800 మీ. రన్నింగ్ -                     170 సెకన్లు

హైజంప్-                                   1.20 మీ.

మహిళ అభ్యర్థులకు ఇలా..

100 మీ. రన్నింగ్ -                   20 సెకన్లు

షాట్‌పుట్ (4 కిలోలు)-              3.75 మీ.

లాంగ్‌జంప్ -                            2.50 మీ.

దరఖాస్తు రుసం.. చివరి తేదీ వివరాలు..

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్‌ తదితర వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.1,000, ఎస్సీ, ఎస్టీలైతే రూ.500, స్థానికేతరులైతే కులాలతో సంబంధం లేకుండా రూ.1,000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పోలీసు ఉద్యోగాలన్నిటికీ ప్రభుత్వం 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. అన్ని ఉద్యోగాలకు 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సైతోపాటు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500, స్థానికేతరులైతే అన్ని కేటగిరీలవారూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్