TS Weather: అలర్ట్… ఇవాళ, రేపు వర్షాలు - పలు జిల్లాలకు హెచ్చరికలు!-light to moderate rains expected at isolated places for two days in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Light To Moderate Rains Expected At Isolated Places For Two Days In Telangana

TS Weather: అలర్ట్… ఇవాళ, రేపు వర్షాలు - పలు జిల్లాలకు హెచ్చరికలు!

HT Telugu Desk HT Telugu
May 24, 2023 08:22 AM IST

Weather Updates of Telangana: తెలంగాణకు మరోసారి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

Telangana Weather Updates: గత కొద్దిరోజులుగా భానుడి దాటికి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రెండు మూడు రోజులుగా పరిస్థితి మారింది. పలుచోట్ల వర్షాలు కురవగా.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గముఖం పట్టాయి. అయితే మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొంది.కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఇక గురువారం ఉదయం తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక రాష్ట్రంలో మంగళవారం కూడా భానుడి భగభగలు ఆగలేదు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే గచ్చిబౌలిలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లాలో 43.7, కొమరంభీ - 43.4, కరీంనగర్ జిల్లా - 43.4, మహబూబాబాద్ - 43.2, ఆదిలాబాద్ -43.0, సూర్యాపేట - 42.9, జగిత్యాల - 42.7, సిద్ధిపేట - 42.7, నల్గొండ -42.7, ఖమ్మం - 42.6, ములుగు - 42.5, నిజామాబాద్ - 42.5, కామారెడ్డి - 42.2, జనగాం - 42.2, రాజన్న సిరిసిల్ల - 42 డిగ్రీలు, కొత్తగూడెం - 41.9, వరంగల్ - 41.8, సంగారెడ్డి - 41.7, హన్మకొండ - 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా మెదక్ జిల్లాలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

IPL_Entry_Point