Rains in Telangana : హైదరాబాద్‌లో వర్షం... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు-light rain in hyderabad city and imd issued yellow alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rains In Telangana : హైదరాబాద్‌లో వర్షం... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు

Rains in Telangana : హైదరాబాద్‌లో వర్షం... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu
Apr 05, 2023 06:57 PM IST

Rains in Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో కూడా వాన పడింది. మరోవైపు పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో వర్షం

Weather Updates of Telangana: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు... శివారు ప్రాంతాల్లో కూడా వాన పడింది. మరోవైపు పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సిటీలోని రాజేంద్రనగర్, మణికొండ, పుప్పాలగూడ, మెహదీపట్నం, జియాగూడ, లంగర్ హౌస్, చార్మినా, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన కురిసింది. దానగర్, లింగంపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మదీనగూడ, జగద్గీర్ గుట్ట, గాజులరామారం ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. ఇక మరికొన్ని గంటల్లో నాదర్ గుల్, బాలాపూర్, ఆదిబట్ల, అరాంఘర్, తుర్క యంజాల్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్చరికలు జారీ...

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలి వేగం 30 -40 కిమీ వేగంతో వీస్తాయని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

టాపిక్