Medaram 2022 | నేడు మేడారంలో తుదిఘట్టం.. సమ్మక్క-సారలమ్మల వనప్రవేశం-last day of medaram sammakka saralamma jatara 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Last Day Of Medaram Sammakka Saralamma Jatara 2022

Medaram 2022 | నేడు మేడారంలో తుదిఘట్టం.. సమ్మక్క-సారలమ్మల వనప్రవేశం

HT Telugu Desk HT Telugu
Feb 19, 2022 09:41 AM IST

ఎక్కడ చూసినా.. జనం.. వన జాతర.. అమ్మల దర్శనం కోసం జనజాతరైంది. ఇప్పటికే కోటి మందికి పైగా వచ్చినట్టు అంచనా. ఇక ఇవాళే చివరి ఘట్టం కావడంతో.. భక్తులు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం.. అమ్మల వన ప్రవేశం జరగనుంది.

మేడారం జాతర 2022
మేడారం జాతర 2022 (twitter)

నేటితో మేడారం జాతర ముగియనుంది. తుదిఘట్టం కావడంతో జాతరకు జనాలు పోటెత్తుతున్నారు. కోటి మందికి పైగా భక్తులు ఇప్పటికే దర్శించుకున్నారు. మంత్రులు, మెుదలు పలువురు భక్తులు అమ్మలను దర్శనం చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం.. గద్దెలపై వడ్డెలు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. ఇవాళ అమ్మవార్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దర్శించుకుంటారు.

దాదాపు నెల రోజుల నుంచి.. భక్తులు అమ్మలను దర్శించుకుంటున్నారు. బుధవారం రోజున జాతర మెుదలైన విషయం తెలిసిందే. రెండో రోజున సమ్మక్క రాకతో ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం రోజున వనదేవతలు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇవాళ చివరిరోజు కావడంతో సాయంత్రం 6 గంటలకు వన ప్రవేశం చేశారు. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక నుంచి మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా.. తరలి వచ్చారు.

రెండు సంవత్సరాలకు ఓసారి జరిగే.. ఈ జాతరకు తెలంగాణతోపాటు.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మేడారం గ్రామం.. ములుగు జిల్లా కేంద్రానికి 44 కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది. మెుదటి రోజున.. మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం గద్దెల పైకి చేరుతారు. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి ఊరేగింపుగా సమ్మక్కను తీసుకొస్తారు. కుంకుమ భరిణె రూపంలో అమ్మవారు గద్దెల పైకి వస్తారు. మూడో రోజు వనదేవతలు.. భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్