GO 111 | జీవో 111పై 2007లో హైకోర్టు ఏం చెప్పింది..?-high court verdict on go 111 in 2007 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Go 111 | జీవో 111పై 2007లో హైకోర్టు ఏం చెప్పింది..?

GO 111 | జీవో 111పై 2007లో హైకోర్టు ఏం చెప్పింది..?

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 08:23 PM IST

జీవో 111పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జీవోను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. అయితే జీవో రద్దు కుదురుతుందా? అనే చర్చ నడుస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జీవో 111 రద్దుపై.. గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. జీవో రద్దుపై.. ట్వీట్ చేశారు. 2007లో హైకోర్టులో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో.. హైకోర్టు అప్పుడు చెప్పిన విషయం ఏంటని ఆసక్తిగా మారింది.

జీవో నెం 111పై 2007 హైకోర్టు ఓ తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 111 పరిధిలోకి వచ్చే గ్రామాలపై ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే.. అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. తదుపరి నిర్ణయం వెలువడేంత వరకూ స్టే ఉంటుందని చెప్పింది. అయితే ఈ విషయం ఇంకా న్యాయ వివాదాల్లోనే ఉందని తెలుస్తోంది.

గతంలోనూ.. ఈ విషయంపై ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. 2016లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ.. నివేదిక ఇవ్వకపోవడంపై ప్రభుత్వంపై మండిపడింది. 22 శతాబ్దంలో నివేదిక ఇస్తారా అని ప్రశ్నించింది. వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లలో గల ప్రైవేట్‌ భూములు జీవో పరిధిలోకి రావంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే 2007లో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు.. అని హైకోర్టు చెసిన వ్యాఖ్యలు ఇప్పుటు చర్చనీయాంశమైంది. ఆ గ్రామాలపై నిర్ణయం తీసుకునే.. అధికారంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు అయితే జీవో 111ను ఎత్తివేస్తున్నామని అఫిడవిట్ సమర్పించలేదు.

ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే.. జీవో.111ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 69 జారీ చేసింది. ఈ విషయంపై.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదని అప్పటి తీర్పు కాపీలను ట్వీట్ చేశారు.

జీవో 111 లో ఏం ఉందంటే..

జీవో ప్రకారంగా చూసుకుంటే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల చుట్టూ 10 కిలోమిటర్ల పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్ గా ఉంటుంది. ఆ చెరువుల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. గ్రామ కంఠాన్ని పక్కనపెడితే.. మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై అబ్జర్వేషన్ ఉండాలి. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలకు చెందిన 84 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం మెుత్తం విస్తీర్ణం ఎంతంటే.. 538 చదరపు కిలోమీటర్లు. మరో హైదరాబాద్ అన్నమాట. ఈ 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇంతటి భూమి భాగ్యనగరానికి దగ్గరలో ఉంది. కేవలం వ్యవసాయ కార్యకలాపాలే కేటాయించాలని ఆదేశించడంతో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు జరగట్లేదు.

శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు దీని కిందకు వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాలు, షాబాద్ మండలం 2 గ్రామాలు, కొత్తూరు మండలం ఒక గ్రామం కూడా జీవో కిందకే వస్తాయి.

IPL_Entry_Point

టాపిక్