Akbaruddin Owaisi | అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యల కేసు.. తీర్పు వాయిదా-court defers judgment in akbaruddin owaisi hate speech cases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Court Defers Judgment In Akbaruddin Owaisi 'Hate Speech' Cases

Akbaruddin Owaisi | అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యల కేసు.. తీర్పు వాయిదా

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 05:04 PM IST

అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగం కేసులో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది. మంగళవారం తీర్పు వెలువరించాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా పడింది. తీర్పు వస్తుందనుకుని.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్బరుద్దీన్ ఒవైసీ(ఫైల్ ఫొటో)
అక్బరుద్దీన్ ఒవైసీ(ఫైల్ ఫొటో)

దాదాపు పదేళ్ల క్రితం.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో.. అక్బరుద్దీన్ చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రెండు మతాల మధ్య చిచ్చు రేపినట్టైంది. అక్బరుద్ధీన్ తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయిన నిర్మల్ లోను, నిజామాబాద్ పర్యటనలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మెుదలైంది. అప్పట్లో కేసు నమోదైంది. దీనిపై.. కేసు కూడా నమోదైంది. నాంపల్లి కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. ఈ కేసు విషయంలో సుమారు 30 మంది సాక్షుల్ని విచారణ చేశారు. ఆయన వ్యాఖ్యాలపై పోలీసులే.. సుమోటోగా కూడా కేసు నమోదు చేశారు.

నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ బహిరంగ సమావేశం జరిగింది. ఈ సభలో ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. ఈ అంశం అప్పట్లో దుమారం రేగింది. 'మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం.’ అని మాట్లాడారు.

ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ నేరపూరిత కుట్ర, 153 ఏ రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం, 295 ఏ ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం, 298 మతపరమైన భావాలను భంగం కలిగేలా మాట్లాడటంతోపాటు 188 సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల వ్యాఖ్యలు చేశారు. వీటితో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చ జరిగింది.

ఈ ప్రసంగం జరిగిన తర్వాత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేగింది. కొన్ని రోజులకు అక్బరుద్దీన్ లండన్ వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చాక.. పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 40 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు అక్బరుద్దీన్. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. దీనిపై.. నాంపల్లి కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. ఇవాళ తీర్పు వస్తుందని.. అందరూ అనుకున్నారు. రంజాన్ మాసం కావటం..దీనికి తోడు అక్బరుద్దీన్ కేసుకు సంబంధించి.. తీర్పు వస్తుందనుకుని.. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీలో శాంతి భద్రతల సమస్య రావచ్చనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

IPL_Entry_Point