Cm Kcr : రాష్ట్రాల ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రం వైఖరి…కేసీఆర్-cm kcr fires on union government for non cooperation to states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Fires On Union Government For Non Cooperation To States

Cm Kcr : రాష్ట్రాల ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రం వైఖరి…కేసీఆర్

B.S.Chandra HT Telugu
Aug 15, 2022 11:26 AM IST

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కేసీఆర్‌ తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. అదే సమయంలో రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరించడంపై మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 41శాతం ఆదాయం రావాల్సి ఉంటే 29.6శాతం వచ్చేలా పన్నుల స్థానంలో సెస్సులు వసూలు చేస్తోందని ఆరోపించారు.

గోల్కొండ కోటలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కేసీఆర్
గోల్కొండ కోటలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కేసీఆర్

ఉమ్మడి జాబితాలో అంశాలను రాష్ట్రాలతో సంబంధం లేకుండానే రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్‌ మండిడపడ్డారు. పసిపిల్లలు తాగే పాలు మొదలుకుని శ్మశానాల వరకు ఎడాపెడా భారం పన్నుల భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అనే సంగతి విస్మరించి సంక్షేమాన్ని ఉచితాలుగా ప్రచారం చేయడాన్ని కేసీఆర్‌ తప్పు పట్టారు. అంతర్జాతీయ విపణిలో రుపాయి విలువ నానాటికి పడిపోవడానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించేలా కేంద్రంర వైఖరి ఉంటోందని, రాజ్యాంగ మూల స్వభావానికి పీఠికకు విరుద్ధంగా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గాలు చూసి స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు. తెలంగాణలో మతచిచ్చు రేపాలని, అభివృద్ధిని అడ్డుకోవడానికి విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రజలు అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత దేశ సహజీవన సౌభ్రాతృత్వాన్ని నిరంతరం కాపాడుకోడానికి ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో గణనీయమైన పురోభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. 11.6శాతం వృద్ధి రేటుతో వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని, గొర్రెల పెంపకంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచామన్నారు. 12.1శాతం ఉత్పత్తి రంగంలో వృద్ధి సాధించినట్లు వివరించారు. ఐటీ ఎగుమతుల్లో 24.1‎శాతం వృద్ధితో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని చెప్పారు. దేశ నిర్మాణంలో బలీయమనైన ఆర్దిక శక్తిగా తెలంగాణ ఎదుగుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 62వేల కోట్ల ఆదాయం నుంచి 1.84లక్షల కోట్లకు ఆదాయం పెరిగిందన్నారు. దేశంలో బలమైన ఆర‌్ధిక శక్తిగా ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం అవతరించిందన్నారు. రాష్ట్ర సొంత పన్నుల్లో 11.6శాతం వృద్ధి రేటు సాధించామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో అన్ని రంగాలలో సులువుగా పెరుగుదల రాలేదని, అవినీతి రహిత పాలన, కఠోర శ్రమతో పెరుగుదల సాధించినట్లు చెప్పారు. గత ఏడేళ్లలో జిఎస్‌డిపి 121 శాతం పెరిగిందని, తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే 27శాతం ఎక్కువగా ఉందని చెప్పారు.

2013-14లో తలసరి ఆదాయం లక్ష రుపాయల నుంచి 2.75లక్షలకు పెరిగిందని చెప్పారు. జాతీయ తలసరి ఆదాయం లక్షన్నర కంటే 80శాతం అధికంగా ఉందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయం,అనుబంధ రంగాలు రెండున్నర రెట్లు అధికంగా పెరిగాయని కేసీఆర్ చెప్పారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించినట్లు చెప్పారు .సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసానికి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అందరి శ్రేయస్సు కోసం పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

కొత్తగా పది లక్షల ఆసరా పెన్షన్లు….

తెలంగాణ వ్యాప్తంగా 10లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వీటి ద్వారా 46లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. సంక్షేమంలో స్వర్ణ యుగాన్ని సాధించినట్లు కేసీఆర్‌ చెప్పారు. పెన్షన్ల అర్హత వయసును కూడా తగ్గించినట్లు చెప్పారు.

75ఏళ్లలో దేశంలో దళితుల జీవితాల్లో అంబేడ్కర్‌ కృషితో కొంత మేర వెలుగులు ప్రసరించినా, ఇప్పటికీ దేశంలో అణిచివేత, వెనుకబాటు తనానికి గురవుతున్నాయని చెప్పారు. దళితుల జీవితాలల్లో మార్పు తెచ్చేందుకు దళిత బంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దళితులు స్వశక్తితో జీవించేలా రూ.10లక్షల రుపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి బ్యాంకు లింకులు లేకుండా పథకాన్ని అందించి వారికి నచ్చిన విధంగా జీవితంలో ఎదిగేలా ప్రభుత్వం సహకరిస్తున్నట్లు చెప్పారు.

లాభదాయక వ్యాపారాల్లో దళితులకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 1,70,700 కుటుంబాలకు ఆర్ధిక సాయంగా 17,700కోట్ల రుపాయలు బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు. దీని ద్వారా 2లక్షల కుటుంబాలకు సాయం అందుతోందన్నారు. లాభదాయక వ్యాపారాల్లో 10శాతం షాపులను దళితులకు కేటాయించినట్లు చెప్పారు. 11.20లక్షల మంది 9,720కోట్ల రుపాయలను కళ్యాణమస్తు పథకంలో భాగంగా సాయంగా అందచేసినట్లు కేసీఆర్ చెప్పారు.

IPL_Entry_Point