BIke Theft : అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. దొంగను పట్టించిన హెల్మెట్-bike theft case helmet helps to police nab thief in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bike Theft Case Helmet Helps To Police Nab Thief In Telangana

BIke Theft : అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. దొంగను పట్టించిన హెల్మెట్

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 04:09 PM IST

Crime News : ఒక్కోసారి చిన్న క్లూ చాలు.. నిందితుడు దొరికిపోయేందుకు. గుండు సూది మీద అనుమానం వచ్చినా.. పోలీసులు దర్యాప్తు చేసి.. నేరుగా నిందితుడి దగ్గరకు వెళ్తారు. ఇదంతా ఎందుకంటే.. బైక్ దొంగిలించిన వ్యక్తిని హెల్మెట్ పట్టించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎక్కడో బైక్ దొంగతనం చేసి.. మరెక్కడో అమ్మేయాలని ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. బైక్(Bike) దొంగతనం చేశాడు. హైవే(Highway) ఎక్కి.. జాలీగా పాటలు పాడుకుంటూ వెళ్లిపోయాడు. ఇక బైక్ అమ్మేస్తే.. అయిపోద్దానే భ్రమాల్లో ఉన్నాడు. బాధితుడు అప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తన బైక్ పోయిందని తెలిపాడు. కేవలం హెల్మెట్ ఆధారంగా.. పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌(secunderabad)లోని సంగీత్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలో బైక్‌ చోరీకి గురైంది. రియాజుద్దీన్‌ అనే వ్యక్తి.. బైక్‌పై దొరికిన హెల్మెట్‌ను ధరించి కామారెడ్డికి విక్రయించేందుకు వెళ్లాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు(Police) సీసీ టీవీ ఫుటేజీని చూడటం మెుదలుపెట్టారు. హెల్మెట్ రంగు కాస్త భిన్నంగా పింక్ కలర్ లో ఉంది. ఇదే పాయింట్ పట్టుకున్నారు పోలీసులు. రంగు కారణంగా పోలీసులు సులభంగా ట్రాక్ చేయగలిగారు.

హైవేపై ఉన్న రెండు టోల్ ప్లాజాల నుంచి సికింద్రాబాద్ టూ కామారెడ్డి(Kamareddy) వరకు 30 సీసీటీవీ కెమెరాల(CCTV Cameras) నుంచి ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నేరుగా రియాజుద్దీన్ వరకు వెళ్లారు. దీంతో నిందితుడు షాక్ అయ్యాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అతడి వద్ద చోరీకి గురైన మరో పది బైకులు కూడా ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలతో సహా అతడిని పట్టుకున్నారు.

గల్ఫ్‌లో ఉన్నప్పుడు రియాజుద్దీన్‌కు ఆరోగ్య సమస్యలు(Health Problems) వచ్చాయి. తన చికిత్స కోసం పొదుపును ఖర్చు చేశాడని విచారణలో తేలింది. గల్ఫ్‌లో ఉన్న అతడిని పట్టించుకునే వారు లేకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతని స్నేహితులు ఇంటికి తిరిగి రావడానికి సహకరించారు. ఆర్థిక పరిస్థితులు దారణంగా తయారయ్యాయి.

తన కుటుంబాన్ని నడపడానికి బంధువులు, స్నేహితుల దగ్గర రియాజుద్దీన్ అప్పులు చేశాడు. దొంగిలించిన బైక్‌లను విక్రయించి.. ఆ సొమ్మును అప్పులు తీర్చేందుకు, ఇంటి అవసరాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. రియాజుద్దీన్ పింక్ హెల్మెట్ ధరించడం వల్ల సులభంగా ట్రాక్ చేసి పట్టుకున్నామని వెల్లడించారు.

IPL_Entry_Point