Sachin on National Sports Day: నేషనల్ స్పోర్ట్స్ డే.. సచిన్ స్పెషల్ వీడియో
Sachin on National Sports Day: నేషనల్ స్పోర్ట్స్ డే అయిన సోమవారం (ఆగస్ట్ 29) నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Sachin on National Sports Day: నేషనల్ స్పోర్ట్స్ డేను సోమవారం (ఆగస్ట్ 29) దేశమంతా ఘనంగా జరుపుకుంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా నేషనల్ స్పోర్ట్స్ డేను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది స్పోర్ట్స్ డే సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఓ స్పెషల్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఇందులో మాస్టర్ తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతూ కనిపించాడు. క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్ ఆడగలిగే మాస్టర్.. ఈ వీడియోలో తన ఫేవరెట్ షాట్స్ అన్నింటినీ ఆడి చూపించాడు. స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, అప్పర్ కట్, పుల్, హుక్ ఇలా తన మాస్టర్ స్ట్రోక్స్ అన్నింటినీ ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు మీ ఫేవరెట్ స్పోర్ట్ ఆడుతున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేయండిని కూడా అభిమానులకు పిలుపునిచ్చాడు.
"నేషనల్ స్పోర్ట్స్ డేనాడు నాకెంతో ఇష్టమైన ఆట, నా జీవితాన్ని అంకితమిచ్చిన ఆటను ఆడకుండా ఎలా ఉండగలను. మీరు కూడా మీ ఫేవరెట్ స్పోర్ట్ ఆడుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేయండి" అని ఈ వీడియోకు సచిన్ క్యాప్షన్ ఉంచాడు. స్పోర్ట్ ప్లేయింగ్ నేషన్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పోస్ట్ చేశాడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా కెరీర్‌గా ముగించిన సచిన్ టెండూల్కర్.. కెరీర్ చివర్లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా అందుకున్న విషయం తెలిసిందే.
హాకీ ఫీల్డ్‌లో మాంత్రికుడిగా పేరున్న ధ్యాన్‌చంద్ జయంతినాడు నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం. అంతేకాదు ఈ మధ్యే స్పోర్ట్స్‌లో అత్యున్నత అవార్డు అయిన ఖేల్‌రత్నకు కూడా ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం మార్చింది. 1926 నుంచి 1949 మధ్య ఇండియన్ టీమ్‌కు ఆడిన ధ్యాన్‌చంద్ తన కెరీర్ మొత్తంలో ఏకంగా 570 గోల్స్ చేయడం విశేషం.