Wriddhiman Saha: ప్యాంట్ రివర్స్‌లో వేసుకొని వచ్చిన సాహా.. పడీపడీ నవ్విన పాండ్యా.. వీడియో వైరల్-wriddhiman saha worn the trousers reverse as hardik pandya could not stop laughing ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wriddhiman Saha Worn The Trousers Reverse As Hardik Pandya Could Not Stop Laughing

Wriddhiman Saha: ప్యాంట్ రివర్స్‌లో వేసుకొని వచ్చిన సాహా.. పడీపడీ నవ్విన పాండ్యా.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
May 08, 2023 04:01 PM IST

Wriddhiman Saha: ప్యాంట్ రివర్స్‌లో వేసుకొని వచ్చాడు గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. అది చూసి పడీపడీ నవ్వాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

ప్యాంట్ రివర్స్ లో వేసుకొని వచ్చిన సాహా
ప్యాంట్ రివర్స్ లో వేసుకొని వచ్చిన సాహా

Wriddhiman Saha: గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆదివారం (మే 7) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రెండు విధాలుగా వార్తల్లో నిలిచాడు. ఒకటి అతని మెరుపు బ్యాటింగ్ తో కాగా.. మరొకటి వికెట్ కీపింగ్ సందర్భంగా తన ప్యాంట్ రివర్స్ లో వేసుకొని వచ్చి అందరినీ నవ్వించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సాహా కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఆ తర్వాత జీటీ ఫీల్డింగ్ సందర్భంగా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. తన ప్యాంట్ ను రివర్స్ లో వేసుకొని సాహా గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. మొదట్లో ఈ పొరపాటును గుర్తించని సాహా.. తర్వాత తనకు తానుగానే తెలుసుకున్నాడు. అతన్ని చూసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా పడీపడీ నవ్వగా.. బౌలింగ్ చేయడానికి సిద్ధమైన మహ్మద్ షమీ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న వాళ్లు కూడా సాహాను చూసి గట్టిగా నవ్వేశారు. అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందో మ్యాచ్ తర్వాత అతడు వివరించాడు. గుజరాత్ టైటన్స్ తోనే ఉన్న ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ తో మాట్లాడుతూ.. సాహా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై స్పందించాడు. తాను తింటున్న సమయంలో ఫిజియో వచ్చి మందులు కూడా వేసుకోవాలని చెప్పాడని, దీంతో తొందర్లో ప్యాంట్ అలా రివర్స్ వేసుకున్నట్లు సాహా చెప్పాడు.

రెండు ఓవర్ల తర్వాత అతడు బయటకు వచ్చేశాడు. కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా భరత్, సాహా కూడా ఆ ఘటనను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. ఈ మ్యాచ్ లో సాహా 43 బంతుల్లోనే 81 పరుగులు చేయడంతో గుజరాత్ టైటన్స్ 2 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత లక్నో కేవలం 171 పరుగులు మాత్రమే చేయడంతో జీటీ 51 పరుగులతో గెలిచి తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం