Gavaskar on Rohit: నంబర్ వన్ బౌలర్‌నే పక్కన పెడతారా.. ఇదేం నిర్ణయం: గవాస్కర్ సీరియస్-gavaskar on rohit says the decision of leaving out ashwin not in his understanding ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Gavaskar On Rohit Says The Decision Of Leaving Out Ashwin Not In His Understanding

Gavaskar on Rohit: నంబర్ వన్ బౌలర్‌నే పక్కన పెడతారా.. ఇదేం నిర్ణయం: గవాస్కర్ సీరియస్

అశ్విన్ ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ సీరియస్
అశ్విన్ ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ సీరియస్ (AP-ANI)

Gavaskar on Rohit: నంబర్ వన్ బౌలర్‌నే పక్కన పెడతారా.. ఇదేం నిర్ణయం అంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ ను తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Gavaskar on Rohit: వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ నే పక్కనే పెట్టడం ఏంటి? ఈ నిర్ణయం నాకు అసలు అర్థం కావడం లేదు అని డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. తానైతే ఈ మధ్యకాలంలో అసలు ఫామ్ లో లేని ఉమేష్ యాదవ్ స్థానంలో అశ్విన్ కు చోటు కల్పించేవాడినని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి అశ్విన్ ను పక్కన పెట్టడంపై చాలా మంది మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్లను ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్ తో.. నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న ఆస్ట్రేలియా టీమ్ ఇబ్బంది పడేదన్నది మాజీల అభిప్రాయం. ఇప్పుడు గవాస్కర్ కూడా అదే చెబుతున్నాడు.

"రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోకుండా ఇండియా పెద్ద తప్పిదం చేసింది. అతడు నంబర్ 1 ర్యాంక్ బౌలర్. అలాంటి ప్లేయర్స్ కోసం పిచ్ చూడాల్సిన అవసరం లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడుతూ టెస్ట్ క్రికెట్ లో నంబర్ వన్ బౌలర్ ను ఎంపిక చేయకపోవడం ఏంటి? టీమిండియా తీసుకున్న ఈ నిర్ణయం నాకు అస్సలు అర్థం కావడం లేదు. చాలా రోజులుగా జట్టుకు దూరంగా ఉన్న, అంతగా రిథమ్ లేని ఉమేష్ యాదవ్ స్థానంలో నేనైతే అశ్విన్ ను తీసుకునే వాడిని" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

నిజానికి గతంలో ఇంగ్లండ్ టూర్ కు వచ్చినప్పుడు కూడా నాలుగు టెస్టుల్లో అశ్విన్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. టెస్టుల్లో లెఫ్ట్ హ్యాండర్లపై అశ్విన్ కు మంచి సక్సెస్ ఉంది. అతడు తీసుకున్న టెస్టు వికెట్లలో 229 లెఫ్ట్ హ్యాండర్లవే. "ఆస్ట్రేలియా జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. అతనికి వాళ్లపై మంచి రికార్డు ఉంది. అయినా జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం షాకింగ్ గా ఉంది" అని గవాస్కర్ అన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్) సెంచరీ, స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) హాఫ్ సెంచరీతో తొలి రోజు ముగిసే సమయానికి ఆసీస్ 85 ఓవర్లలో 3 వికెట్లకు 327 రన్స్ చేసింది.

సంబంధిత కథనం