Sunil Gavaskar : ఆసీస్‌ను ఓడించేందుకు గవాస్కర్ టీమ్ ఇదేనట
WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచేందుకు టీమిండియాకు మరో అవకాశం లభించింది. గత ఎడిషన్‌లో ఫైనల్స్‌లో తడబడిన భారత జట్టు.. ఇప్పుడు మళ్లీ ఫైనల్స్‌లోకి ప్రవేశించి ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)లో ఆడేందుకు ప్రస్తుతం లండన్‌లోని ఓవల్ మైదానంలో టీమ్ ఇండియా చివరి దశ ప్రాక్టీస్ నిర్వహిస్తుండడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పటిష్టమైన టీమ్ ఇండియాను ఎంపిక చేశాడు. ఈ జట్టుతో పోటీపడితే టీమిండియా ఛాంపియన్‌గా నిలుస్తుందని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గవాస్కర్ పేర్లు ఎంపిక చేసిన జట్టులో ఏ ఆటగాళ్లకు అవకాశం లభించింది?
సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన ఈ ప్లేయింగ్ స్క్వాడ్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు. వికెట్ కీపర్ విషయంలోనూ తన వైఖరిని వెల్లడించాడు. 'రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లు. పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, అజింక్య రహానె ఐదో స్థానంలో బాగుంటుంది. కెఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్‌ను ఆరో నంబర్‌లో ఊహించుకుంటున్నాను. అతని పేరు బాగా వినిపిస్తున్నందున ఆరో నంబర్‌లో ఎంపిక చేస్తాను.' అని గవాస్కర్ అన్నాడు.
బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja), ఆర్ అశ్విన్‌లను స్పిన్నర్లుగా గవాస్కర్ ఎంపిక చేశాడు. అంటే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఫీల్డింగ్ చేయాలని సూచించాడు. 'రవీంద్ర జడేజాను నెంబర్ 7లో ఎంపిక చేస్తాను. వాతావరణం ఎండగా ఉండి, ఎండలు కొనసాగే సూచన ఉంటే, జడేజా, అశ్విన్‌లిద్దరు ఆడాలనుకుంటున్నాను. జడేజా నంబర్ 7లో అశ్విన్ 8వ స్థానంలో తర్వాత మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.' అని జట్టును ఎంచుకున్నాడు గవాస్కర్.
WTC ఫైనల్‌కు సునీల్ గవాస్కర్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
టీమ్ ఇండియా కంప్లీట్ స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
ఆస్ట్రేలియా పూర్తి జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
సంబంధిత కథనం