Importance of Each Ekadashi: ఏ ఏకాదశి ఉపవాసానికి ఏ పుణ్యం లభిస్తుంది?-know importance of 24 ekadashi fasting and its virtues ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Know Importance Of 24 Ekadashi Fasting And Its Virtues

Importance of Each Ekadashi: ఏ ఏకాదశి ఉపవాసానికి ఏ పుణ్యం లభిస్తుంది?

HT Telugu Desk HT Telugu
May 15, 2023 10:00 AM IST

Importance of Each Ekadashi: ఏ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తూ వ్రత నియమాలు పాటిస్తే ఏ పుణ్యం లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలతో ఉపవాసం చేయడం ద్వారా పుణ్య ఫలం
ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలతో ఉపవాసం చేయడం ద్వారా పుణ్య ఫలం (twitter)

Importance of Each Ekadashi: చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు. మరికొంతమంది ప్రతి ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తారు. సంవత్సరంలో 24 ఏకాదశి రోజులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశిలోనూ ఏకాదశి నియమాలు వేర్వేరుగా పాటిస్తారు. ఆయా ఏకాదశి రోజులకు అనుగుణంగా నియమాలు పాటిస్తే వచ్చే పుణ్య ఫలాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

  1. చైత్ర మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం చేస్తూ నియమాలు పాటించాలి. మీ కోరికలు నెరవేరుతాయి.
  2. చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. వ్రతం చేస్తూ నియమాలు పాటిస్తే పాపాలు తొలగిపోతాయి. గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది.
  3. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఆర్థిక సమస్యలు ఉన్న వారు ఈ వ్రతం పాటించి నియమాలు పాటిస్తే ధనలాభం కలుగుతుంది.
  4. వైశాఖ మసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. వ్రతం ఆచరిస్తే అశ్వమేథ యాగం చేసిన ఫలితం వస్తుంది.
  5. జ్యేష్ట మాసం శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈరోజు నిర్జల ఉపవాసం చేస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. వేసవి కాలంలో నీరు కూడా తీసుకోకుండా చేసే ఈ ఉపవాసం చాలా కష్టమైన పని.
  6. జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అంటారు. మనం చేసే తప్పులు, పొరపాట్లు పోవాలంటే ఈ వ్రతం ఆచరించాలి.
  7. ఆషాడ మాసం శుక్లపక్షంలో వచ్చే శయన ఏకాదశి అంటారు. మనం తొలి ఏకాదశిగా పండగ జరుపుకుంటాం. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు. ఈ వ్రతం ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది.
  8. ఆషాడ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. వ్రతం ఆచరిస్తే ఉన్నత స్థితిలోకి వస్తారు.
  9. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. నియమ నిబంధనలతో వ్రతం ఆచరిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.
  10. శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. మోక్ష ప్రాప్తికి ఈ వ్రతం ఆచరిస్తారు. ఆపదలు తొలగుతాయి.
  11. భాద్రపద మాసం శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. మహా విష్ణువు శయన భంగిమ మార్చుకునే రోజు. ఈ రోజు దాన ధర్మాలు చేయాలి. వ్రతం ఆచరిస్తే భూదానం చేసినంత పుణ్యం లభిస్తుంది.
  12. భాద్రపద మాసం కృష్ణ పక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. వ్రతం ఆచరిస్తే పితృదేవతలు స్వర్గానికి వెళతారు.
  13. ఆశ్వయుజ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. వ్రత నియమాలు పాటిస్తూ ఉపవాసం చేస్తే అకాల మృత్యు భయం ఉండదు.
  14. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. వ్రత నియమాలు, నిబంధనలు ఆచరిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది.
  15. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. విష్ణు మూర్తి నిద్ర నుంచి లేచే రోజు. వ్రతం ఆచరిస్తే జ్ఞాన సంపద పెరుగుతుంది.
  16. కార్తీక మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు. నియమాలు పాటిస్తూ ఉపవాస వ్రతం ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది.
  17. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని పూజించాలి. మోక్షమార్గ ప్రాప్తికి ఈ వ్రతాన్ని ఆచరించాలి.
  18. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. వ్రత నియమాలతో ఉపవాసం ఆచరిస్తే సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
  19. పుష్య మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ వ్రత నియమాలు ఆచరిస్తూ ఉపవాసం చేస్తే సంతానప్రాప్తి లభిస్తుంది.
  20. పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. నువ్వులు దానం చేయాలి. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఈరోజు వ్రతం ఆచరిస్తూ ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోతాయి.
  21. మాఘ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. దీనిని భీష్మ ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని పూజిస్తూ వ్రతం ఆచరించాలి. కోరికలు నెరవేరుతాయి.
  22. మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. వ్రతం ఆచరిస్తే మీరు చేసే కృషి ఫలిస్తుంది.
  23. ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు. ఈ వ్రతంలో ఉసిరికాయకు ప్రాముఖ్యత ఉంది. వ్రతం ఆచరిస్తే రుగ్మతలు తొలగిపోతాయి.
  24. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరిస్తే పాప విమోచనం లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం