రాశులపై గురు ఛండాల యోగం బుధుని అస్తమ ప్రభావం
రాశులపై గురు ఛండాల యోగం, బుధుని అస్తమ ప్రభావం కనిపించనుంది. మేషరాశిలో బుధుడు, గురు, రాహువుల సంచారము జరగడం వ్యాపార వర్గాలకు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు, కొన్ని రాశుల జాతకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.
రాశులపై గురు ఛండాల యోగం, బుధుని అస్తమ ప్రభావం కనిపించనుంది. మేషరాశిలో బుధుడు, గురు, రాహువుల సంచారము జరగడం వ్యాపార వర్గాలకు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు, కొన్ని రాశుల జాతకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
మేషరాశిలో గురు ఛండాల యోగం ప్రభావం చేత, బుధ, గురు, రాహువులు కలిసి మేషరాశిలో సంచరించడం చేత కొన్ని రాశుల వారికి ఆర్ధికముగా, వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఏర్పడుతున్నాయి అని చిలకమర్తి తెలిపారు.
ఏయే రాశులపై ప్రభావం?
- మేషరాశి వారికి జన్మరాశిలో బుధ, గురు, రాహువుల ప్రభావంచేత ఉద్యోగ వ్యాపార ఆర్ధిక సమస్యలు, ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. మేషరాశివారు ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి.
- వృషభ రాశివారికి వ్యయస్థానంలో బుధ, గురు, రాహువుల సంచారము వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి.
- కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగములో చికాకులు అధికముగా ఉంటాయి.
- కన్యారాశి వారికి ఉద్యోగ సమస్యలు అధికముగా ఉండబోతున్నాయి.
- తులా రాశి జాతకులకు కుటుంబ సమస్యలు అధికము.
- వృశ్చిక రాశి జాతకులకు మానసిక వేదన ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
- మకర రాశి వారికి ఖర్చులు అధికమగును.
- మీన రాశి జాతకులకు ఖర్చులు, వ్యాపార సమస్యలు అధికము.
మొత్తంమీద ప్రస్తుత గ్రహస్థితి పైన చెప్పిన రాశుల వారికి చెడు ఫలితాలను సూచిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆర్థిక చిక్కులు ఏర్చడే స్ధితి గోచరిస్తోందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఐటీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది.
శుభఫలితాల కోసం పరిహారాలు
ప్రస్తుత గ్రహస్థితిని అనుసరించి పై రాశుల వారు వ్యాపారస్తులు శుభఫలితాలు పొందాలనుకుంటే గురువారం రోజు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణా మూర్తి స్తోత్రాలను పఠించాలి. శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఆరాధించడం వలన, దుర్గా అష్ట్రోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించడం వలన కొంత శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.