Dussehra Ravan Dahan 2022 : రావణ దహనం చేయడానికి శుభముహుర్తం అదే..
Dussehra Ravan Dahan Timing 2022 : రావణ దహనం లేనిదే.. దసరా సంపూర్ణమవదు. మంచిపై చెడు గెలిచినందుకు ప్రతీకగా.. రావణుడిపై రాముడి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దహనాన్ని చేస్తారు. అయితే దీనిని చేసేందుకు కూడా శుభముహుర్తం, పూజసమయం ఉంటుంది. మరి రావణుడి దిష్టిబొమ్మ సమయానికి శుభముహూర్తం ఎప్పుడో ఇప్పుడు చుద్దాం.
Dussehra Ravan Dahan Timing 2022 : రావణుడి దహనం అనేది దసరా వేడుకలో ఒక ముఖ్యమైన ఆచారం. దానిని ప్రతి సంవత్సరం విజయదశమి రోజు పాటిస్తారు. ఈ పండుగలో భాగంగా.. కుంభకర్ణుడు (రావణుడి తమ్ముడు), మేఘనాద (రావణుని కుమారుడు) దిష్టిబొమ్మలతో పాటు.. రావణుడి పది తలల దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దసరా ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్ష దశమి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు కూడా దసరాతో ముగుస్తాయి. దసరా పండుగ సీతను అపహరించిన రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. దసరా పాపాలు లేదా చెడు లక్షణాలను వదిలించుకోవడాన్ని చాటి చెప్తుంది. ఎందుకంటే రావణుడి ప్రతి తల ఒక చెడు గుణాన్ని సూచిస్తుంది. అందుకే రావణ దహనం చేసి.. మనలోని చెడు గుణాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
ఋషి విశ్రవుడు, రాక్షసి కైకేసి కుమారుడైన రావణుడు.. అశోక వనంలో లంకలో సీతను బందీగా ఉంచాడు. వానర రాజు సుగ్రీవుడు, అతని వానరుల (కోతుల) సైన్యంతో శ్రీరాముడు.. రావణుడిని వధించాడు. దానిని దసరాగా పిలుస్తారు. రావణుడిని చంపిన 20 రోజుల తర్వాత.. రాముడు, సీత అయోధ్యకు చేరుకున్నారు. ఆరోజునే దీపావళిగా చేసుకుంటారు.
ఉత్తర భారతదేశంలో ప్రతి సంవత్సరం, రామ్ లీల నిర్వహిస్తారు. ఇది రాముడి కథ (రామచరిత్మానస్ ఆధారంగా) పాట, కథనం, పఠనం, సంభాషణలతో పూర్తి అవుతుంది. ఇది నవరాత్రి మొదటి రోజున ప్రారంభమై రావణ దహనంతో ముగుస్తుంది. విజయదశమి తర్వాత 20 రోజుల తర్వాత వచ్చే హిందువుల అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళికి.. దసరా ముగింపుతో సిద్ధం అవుతారు.
రావణ దహనం తేదీ, సమయం
చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీకగా.. ఈ రావణ దహనం చేస్తారు. అయితే ఈ సంవత్సరం సూర్యాస్తమయం తర్వాత రాత్రి 8:30 గంటల వరకు రావణ దహనం నిర్వహిస్తారు. రావణ దహనం శ్రావణ నక్షత్రం సమయంలో ప్రదోషకాలంలో జరుగుతుంది. రావణదహనం తర్వాత బూడిదను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు.
దసరా పూజ సమయం 2022
దసరా పూజను దృక్పంచాంగ్ ప్రకారం.. మధ్యాహ్నం 02:07 నుంచి 02:54 వరకు చేయవచ్చు. దుర్గా నిమజ్జన ముహూర్తం ఉదయం 6:16 నుంచి 8:37 వరకు ఉంటుంది.
సంబంధిత కథనం