Sexual Problems : ఈ ఫుడ్స్ తింటే.. లైంగిక సమస్యలు దూరమైపోతాయంట..!
- ఈ రోజుల్లో చాలా మంది ఇతరత్ర కారణాల వల్ల లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులు వ్యక్తి శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఐతే ఈ సమస్యను అధిగమించాలంటే డైట్‌లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈ రోజుల్లో చాలా మంది ఇతరత్ర కారణాల వల్ల లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులు వ్యక్తి శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఐతే ఈ సమస్యను అధిగమించాలంటే డైట్‌లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 7)
మీకు లైంగిక సమస్యలు ఉన్నట్లయితే లేదా శారీరక సంబంధం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోతే.. ,మీరు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. (HT)
(2 / 7)
సెక్స్ లైఫ్ ఆనందదాయకంగా ఉండాలంటే, సెక్స్ సమయాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి అంటున్నారు సెక్సాలజిస్టులు. అవి శరీరంలో హార్మోన్లను పెంచడంలో సహాయపడుతాయి అంటున్నారు. ఇంతకీ ఏ ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
(3 / 7)
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్ల స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా లైంగిక సమస్యలతో బాధపడేవారు.. హ్యాపీగా దీనిని లాగించేయవచ్చు. అదనంగా డార్క్ చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. (HT)
(4 / 7)
సాల్మన్ చేపలో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ రకమైన చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.(HT)
(5 / 7)
ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక సమస్యలను తగ్గించుకోవడానికి అరటిపండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ఇందులోని మెగ్నీషియం శరీరంలోని ఆక్సిటోసిన్ విడుదలలో సహాయపడుతుంది.(HT)
(6 / 7)
అవకాడో తీసుకోవడం వల్ల శరీరంలో ప్రేమ హార్మోన్లు పెరుగుతాయి. ఈ పండును పాలతో కలిపి తినవచ్చు. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్నవారు అవకాడోను తినొచ్చు అంటున్నారు సెక్సాలజిస్టులు.(HT)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు