తెలుగు న్యూస్ / ఫోటో /
Plant-based Proteins | ఊబకాయం తగ్గించుకోవాలంటే.. ఈ ప్రోటీన్ పదార్థాలు తీసుకోవాలి
- కొన్ని రకాల మొక్కల ఆధారిత ప్రొటీన్లను తినడం ద్వారా ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం పోషకాహార నిపుణురాలు సరికా నాలుగు ఆహారాల గురించి తెలియజేశారు.
- కొన్ని రకాల మొక్కల ఆధారిత ప్రొటీన్లను తినడం ద్వారా ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం పోషకాహార నిపుణురాలు సరికా నాలుగు ఆహారాల గురించి తెలియజేశారు.
(1 / 6)
ఇటీవల కాలంగా మొక్కల ఆధారిత ప్రోటీన్లు ఫిట్‌నెస్ ఔత్సాహికులలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అధ్యయనాల ప్రకారం, మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు దూరం అవుతాయని తేలింది. వీటిలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది, ఈ రకమైన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పోషకాహార నిపుణురాలు సరికా మాట్లాడుతూ ఆహారంలో తప్పనిసరిగా మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు ఉండాలి అని చెబుతున్నారు.(Pinterest, Pixabay)
(2 / 6)
హెంప్ విత్తనాలు: హెంప్ సీడ్స్ ఎంతో విలక్షణమైనవి. 3 టేబుల్ స్పూన్లలో 10 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. వీటిని పచ్చడి, చపాతీ లేదా కూరల్లో పైన చల్లుకొని తినాలి.(Pinterest)
(3 / 6)
సబ్జా గింజలు: 2 టేబుల్ స్పూన్లలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సబ్జా పుడ్డింగ్ చేయండి లేదా మీ అవోకాడో టోస్ట్‌పై చల్లుకోండి. ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగితే మలబద్ధకం సమస్య ఉండదు.(Pinterest)
(4 / 6)
గుమ్మడికాయ గింజలు: ¼ కప్పులో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. టోస్ట్ పైన, సలాడ్ పైనా, లేదా అటుకుల్లోనూ కలుపుకొని తినొచ్చు.(Pixabay)
(5 / 6)
టోఫు: క్వినోవా లేదా అన్నంతో లేదా ఏదైనా కూరగాయలతో కలిపి తినండి. ప్రోటీన్ లంచ్ కోసం మీ సలాడ్‌లో జోడించండి.(Pixabay)
ఇతర గ్యాలరీలు