హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ పులప్స్‌… గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం-youtubers smash guinness world record by doing 25 pull ups from helicopter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Youtubers Smash Guinness World Record By Doing 25 Pull-ups From Helicopter

హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ పులప్స్‌… గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం

Mahendra Maheshwaram HT Telugu
Aug 07, 2022 08:56 AM IST

Guinness World Record: ఇద్దరూ యూట్యూబర్లు గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్ చేసి గిన్నిస్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబ‌ర్లు, ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ ఈ ఫీట్ ను సాధించారు.

అత్య‌ధిక‌ పులప్స్‌ చేసిన ఇద్ద‌రు యువ‌కులు
అత్య‌ధిక‌ పులప్స్‌ చేసిన ఇద్ద‌రు యువ‌కులు (ANI)

youtubers smash guinness world record,: పుషప్స్, పులప్స్.... సాధారణంగా చేస్తుంటారు. కానీ ఓ టార్గెట్ పెట్టుకొని చేయాలంటే మాత్రం చాలా ఫిట్ నెస్ ఉండాల్సిందే. ఇదే టాస్క్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచించి... పెద్ద టాస్క్ తీసుకున్నారు. ఇద్దరు యూట్యూబర్లు. ఎగురుతున్న హెలికాప్టర్ కు వేలాడుతూ పులప్స్ కొట్టి... గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

ట్రెండింగ్ వార్తలు

నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబ‌ర్లు, ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ ఈ ఫీట్ ను సాధించారు. బెల్జియంలోని అంట్‌వెర్ప్ హొయివెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లోహెలికాప్ట‌ర్ల‌కు వేలాడుతూ ఈ ఇద్ద‌రూ పులప్స్ చేశారు. మొదట అర్జెన్ అల్బ‌ర్స్ ఒక్క నిమిష‌ంలో మొత్తం 24 పులప్స్ చేశాడు. అంత‌కు ముందు అమెరికా వ్య‌క్తి రొమ‌న్ సహృద్యన్ (23 పులప్స్‌) పేరిట ఉన్న రికార్డును అర్జున్ బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే... అల్బర్స్ రికార్డు క్షణాల్లోనే అధిగమించేశాడు మరో యూట్యూబర్ స్టాన్ బ్రౌనీ... హెలికాప్టర్ కు వేలాడుతూ నిమిషంలో 25 పులప్స్ చేసి కొత్త రికార్డును సృష్టించాడు. ఈ సాహసాన్ని జూలై 6వ తేదీని చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు... వారి యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసింది. ఈ రికార్డును సాధించేందుకు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ దాదాపు 15 రోజుల పాటు హెలికాప్టర్ పై సాధన చేశారని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు తెలిపింది. ఇక వీరి రికార్డుపై నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత క్రేజీ రికార్డు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్