Viral Video: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు: వైరలవుతున్న వీడియో.. పోలీసుల దర్యాప్తు-video of japanese woman being harassed in delhi during holi celebrations video goes viral delhi police probe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు: వైరలవుతున్న వీడియో.. పోలీసుల దర్యాప్తు

Viral Video: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు: వైరలవుతున్న వీడియో.. పోలీసుల దర్యాప్తు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2023 06:29 AM IST

Japanese woman harassed: జపనీస్ యువతిని ఢిల్లీలో కొందరు యువకులు వేధించారు. హోలీ వేడుకల్లో ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు: వైరలవుతున్న వీడియో
Viral Video: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు: వైరలవుతున్న వీడియో

Japanese Woman Harassed during Holi: హోలీ వేడుకల్లో జపాన్‍కు చెందిన ఓ యువతికి వేధింపులకు గురైంది. ఢిల్లీలో ఓ యువకుల గుంపు ఆమెను చుట్టుముట్టింది. ఆమె వద్దంటున్నా ఆ యువకులు రంగులు పూసి, కోడిగుడ్డు కొట్టారు. అభ్యంతరకరంగా తాకారు. హోలీ సందర్భంగా జపనీస్ యువతిని యువకులు వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు అధికమయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలివే..

ఇదీ జరిగింది

Japanese Woman Harassed during Holi: ఢిల్లీలో హోలీ హై అంటూ అరుస్తూ కొందరు యువకులు జపాన్‍కు చెందిన ఓ అమ్మాయిని చుట్టుముట్టారు. ఆమెను పట్టుకొని రంగులు పూశారు. ఒక అబ్బాయి.. ఏకంగా ఆమె తలపై కోడిగుడ్డు కొట్టాడు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి బై, బై అని చెప్పినా వారు వద్దల్లేదు. మళ్లీ వారు ఆమెను లాగారు. ఓ అబ్బాయి అభ్యంతరకరంగా తాకడంతో ఆమె అతడి చెంపపై కొట్టింది. మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడం, ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముఖం నిండా రంగులు ఉన్న కారణంగా ఆ జపాన్ అమ్మాయి ముఖాన్ని గుర్తు పట్టలేదు. “వీడియోలోని ప్రాంతాన్ని బట్టి చూస్తే ఇది పహర్‌గంజ్ ప్రాంతంలో జరిగినట్టు కనిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ విషయం విచారణ చేస్తున్నాయి. ఈ వీడియో ఇప్పటిదేనా.. గతంలోదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసులు చెప్పారు.

హోలీ వేడుకల్లో విదేశీ యువతిపై వేధింపులకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు, కాల్ రాలేదని పహరగంజ్ పోలీసులు వెల్లడించారు. ఆ అమ్మాయి ఎవరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ యువతిని గుర్తించేందుకు, ఇతర వివరాల కోసం జపాన్ ఎంబసీకి ఈ-మెయిల్ పంపామని పోలీసులు తెలిపారు.

ఈ వీడియో వైరల్ అవటంతో జపాన్ యువతిని వేధించిన యువకులను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‍(NCW) కు ట్యాగ్ చేసి.. చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. “చాలా బాధగా ఉంది. NCWకు ఆ యువతి నోటీస్ పంపాలి” అని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ ఖుష్బూ ట్వీట్ చేశారు.

IPL_Entry_Point