Crime : ప్రేమించిందని.. 'కిల్లర్​' తో కూతురిని చంపించేందుకు సిద్ధపడ్డ తండ్రి!-up man hired killer to murder 17year old daughter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Man Hired Killer To Murder 17year Old Daughter

Crime : ప్రేమించిందని.. 'కిల్లర్​' తో కూతురిని చంపించేందుకు సిద్ధపడ్డ తండ్రి!

Sharath Chitturi HT Telugu
Aug 07, 2022 03:21 PM IST

ఆ మైనర్​.. ఓ వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం ఆమె కుటుంబసభ్యులకు నచ్చలేదు. ఆమెను చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ప్రేమించిందని.. కూతురిని చంపేందుకు సిద్ధపడ్డ తండ్రి..
ప్రేమించిందని.. కూతురిని చంపేందుకు సిద్ధపడ్డ తండ్రి.. (HT Telugu)

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక.. ఓ మైనర్​ ఇంటి టెర్రస్​ పై నుంచి కిందకి దూకేసింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమిస్తుండటంతో..సొంత బిడ్డను చంపేందుకు ఆ తండ్రి ప్రయత్నించాడు. ఇందుకోసం ఆసుపత్రి సిబ్బందికి డబ్బులిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆసుపత్రిలో ‘కిల్లర్​’..

నవీన్​ కుమార్​ అనే స్థిరాస్తి వ్యాపారి.. తన కుటుంబంతో మీరట్​ అనే ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ఓ 17ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ వ్యక్తిని మరచిపోవాలని.. కుటుంబసభ్యులు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె వారి మాటలు వినలేదు. ఈ క్రమంలో.. కూతురిపై తండ్రి నవీన్​కు కోపం పెరిగిపోయింది.

కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేక.. ఓ మైనర్​.. ఇంటి టెర్రస్​ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి.. ఆ మైనర్​ను కుటుంబసభ్యులు కన్​కర్​ఖేడ్​ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మోడీపురంలోని ఫ్యూచర్​ ప్లస్​ ఆసుపత్రికి తరలించారు.

తన మాట వినకుండా ప్రవర్తిస్తున్న కూతురిని చంపేందుకు ప్లాన్​ వేశాడు నవీన్​ కుమార్​. అక్కడే ఉన్న ఓ వార్డ్​ బాయ్​ నరేష్​ కుమార్​తో ప్రణాళిక రచించాడు. అతడి చేతికి రూ. 1లక్ష ఇచ్చి.. తన కూతురిని చంపేయాలని చెప్పాడు. డబ్బుకు ఆశపడి.. ఆ వార్డ్​ బాయ్​ ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు.

అర్ధరాత్రి వేళ.. ఎవరూ లేని సమయంలో.. వైద్యుడి వేషంలో లోపలికి ప్రవేశించాడు నరేష్​ కుమార్​. ఇందుకు అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగిని సాయం చేసింది. మైనర్​ వద్దకు వెళ్లిన నరేష్​.. పొటాషియం క్లోరైడ్​ ఇంజెక్షన్​ను ఇచ్చాడు. డోసు ఎక్కువ అవ్వడంతో.. ఆ మైనర్​ పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. నరేష్​ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇతర వైద్యులు వచ్చి చూసేసరికి.. ఆ మైనర్​ తీవ్రంగా బాధపడుతోంది. అసలేం జరిగిందో వారికి అర్థం కాలేదు. చివరికి.. పొటాషియం క్లోరైడ్​ ఇచ్చినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ మైనర్​ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును సాల్వ్​ చేసేశారు. సీసీటీవీ ఫుటేజీలో అంతా రికార్డు అయ్యి ఉంది. నరేష్​ లోపలికి వెళ్లడం, ఇంజెక్షన్​ ఇవ్వడం స్పష్టంగా కనిపించింది.

ఈ నేపథ్యంలో నరేషన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్​ చెప్పడంతోనే ఈ పని చేసినట్టు నరేష్​ పోలీసులకు చెప్పేశాడు. ఈ క్రమంలోనే నవీన్​తో పాటు.. నరేష్​కు సాయం చేసిన మహిళా ఉద్యోగిని పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు.

విచారణలో భాగంగా.. నవీన్​ నిజం ఒప్పుకున్నాడు. తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమిస్తున్నందుకే.. తన బిడ్డను చంపాలని చూసినట్టు అంగీకరించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం