Tax-saving FDs: టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ కోసం చూస్తున్నారా? మెరుగైన వడ్డీ ఇచ్చేవివే-taxsaving fixed deposits these private psu banks offer best interest rate on schemes
Telugu News  /  National International  /  Tax-saving Fixed Deposits These Private, Psu Banks Offer Best Interest Rate On Schemes
సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు
సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (REUTERS)

Tax-saving FDs: టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ కోసం చూస్తున్నారా? మెరుగైన వడ్డీ ఇచ్చేవివే

22 September 2022, 18:32 ISTHT Telugu Desk
22 September 2022, 18:32 IST

Tax-saving FDs: రిస్క్ లేని, సురక్షితమైన రాబడుల కోసం ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందుంటాయి.

Tax-saving FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఎఫ్‌డి స్కీమ్ మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మీరు స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, పన్ను ప్రయోజనాలను పొందేందుకు తగిన కార్పస్‌ను రూపొందించడానికి వీటిలో పొదుపు చేయవచ్చు.

మీరు సాంప్రదాయిక డిపాజిటర్ అయితే ఇతర మార్కెట్-లింక్డ్ ట్యాక్స్-సేవింగ్ స్కీమ్‌ల కంటే సురక్షితమైన పొదుపు మార్గాలలో ఒకటిగా పరిగణిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేయవచ్చు.

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు విభిన్న కాలవ్యవధుల ఆప్షన్లతో వస్తాయి. మీరు ఎంచుకున్న స్కీమ్‌ను బట్టి మీరు 1 నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధితోనూ వస్తాయి. అయితే అన్ని రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మీకు పన్ను-ప్రయోజనాన్ని అందించేందుకు పనికిరావు. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పన్ను ఆదా ప్రయోజనాలు ఉంటాయి.

అటువంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపును పొందవచ్చు. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మీరు చేసే గరిష్ట పెట్టుబడి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. అటువంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు ఆ పథకం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, నిబంధనలు, షరతులను తనిఖీ చేయాలి. సాధారణంగా, మీరు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై రుణాలు లేదా అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాలను పొందలేరు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా యొక్క మొదటి హోల్డర్‌కు మాత్రమే పన్ను ప్రయోజనం అందుబాటులో ఉంటుందని మీరు తప్పక తెలుసుకోవాలి. కాబట్టి మీకు జాయింట్ హోల్డర్ ఉన్నట్లయితే, రెండోవారు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు.

కొన్ని ఉత్తమ 5 సంవత్సరాల బ్యాంకుల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చూడండి.

<p>21 సెప్టెంబరు 22 నాటి డేటా ఆధారంగా వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పట్టిక</p>
21 సెప్టెంబరు 22 నాటి డేటా ఆధారంగా వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పట్టిక

మీరు బ్యాంకుల వెబ్‌సైట్ లేదా సమీపంలో ఉన్న బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా అటువంటి పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేయవచ్చు. అటువంటి పన్ను ఆదా ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

(డిస్‌క్లెయిమర్: పట్టికలో బీఎస్ఈలో లిస్టయి ఉన్న పబ్లిక్, ప్రయివేటు బ్యాంకులు (విదేశీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మినహాయించి) వడ్డీ రేట్లను డేటా సంకలనం కోసం పరిగణనలోకి తీసుకున్నాం. వెబ్‌సైట్లలో వడ్డీ రేటు ప్రకటించని వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పట్టికలో కేవలం టాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను మాత్రమే (నాన్- సీనియర్ సిటిజెన్) పరిగణనలోకి తీసుకున్నాం..)