Shraddha murder case: ‘‘ఎలా చంపుతానని బెదిరించాడో.. అలానే చంపేశాడు’’
Shraddha murder case: సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ హత్య కేసుకు సంబంధించిన వాదనలు కోర్టులో ప్రారంభమయ్యాయి. ప్రిప్లాన్డ్ గానే నిందితుడు ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) శ్రద్ధను హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
Shraddha murder case: శ్రద్ధ వాల్కర్ హత్య కేసు వాదనలు ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టులో ప్రారంభమయ్యాయి. నిందితుడు ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) ముందుగానే ప్లాన్ చేసుకుని శ్రద్ధను హత్య చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. గతంలో ఎలా చంపుతానని ఆమెను బెదిరించాడో, అదే తరహాలో హత్య చేశాడని వివరించారు.
Shraddha murder case: పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో..
ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) తో సహజీవనం చేస్తున్న సమయంలో మహారాష్ట్ర పోలీసులకు శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) ఒకసారి ఫిర్యాదు చేశారు. చంపేస్తానని తనను ఆఫ్తాబ్ బెదిరిస్తున్నాడని, గొంతు నులిమి చంపి, ఆ తరువాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తానని హెచ్చరించాడని ఆమె ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ తరువాత అదే తరహాలో శ్రద్ధ వాల్కర్ ను నిందితుడు ఆఫ్తాబ్ హత్య చేశాడని పోలీసుల తరఫు న్యాయవాది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ కోర్టుకు వివరించారు.
Shraddha murder case: 35 ముక్కలు చేసి..
లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) ను ఢిల్లీలో ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా (Aaftab Amin Poonawala) దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను గొంతు నులిమి హతమార్చిన అనంతరం, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కట్ చేసి, వాటిని ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. అనంతరం, ఒక్కో ముక్కను బ్యాగ్ లో ప్యాక్ చేసి ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు (delhi police) పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితుడు ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) ను దోషిగా తేల్చే అన్ని సాక్ష్యాధారాలను సిద్ధం చేశారు.
Shraddha murder case: ప్రి ప్లాన్డ్ మర్డర్
ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) శ్రద్ధను క్షణికావేశంలో హత్య చేయలేదని, ఆమెను చంపాలని ముందే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వారిద్ధరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అయినా బంధాన్ని నిలుపుకోవడం కోసం శ్రద్ధ (Shraddha Walkar) ప్రయత్నించిందని వివరించారు. ఒకసారి సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకుందని తెలిపారు. ఇద్దరు కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా వెళ్లారని తెలిపారు. శ్రద్ధ హత్యకు గురైన మే 18న ఆమె తన ఫ్రెండ్ ను కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆటోలో తిరిగివచ్చింది. ఆ తరువాత వారిద్దరి మధ్య ఘర్షణ జరగడం, ఆఫ్తాబ్ శ్రద్ధ (Shraddha Walkar)ను హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తరువాత వెంటనే, శ్రద్ధ బ్యాాంక్ ఖాతాలోని మొత్తం డబ్బును తన ఖాతాలోకి ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. తరువాత ఒక రంపం, చెత్త వేసే బ్యాగ్ లు, కత్తి, డ్రై ఐస్.. మొదలైనవాటిని కొని తీసుకువచ్చాడు. ఒక డబుల్ డోర్ ఫ్రిజ్ ను కూడా కొన్నాడు.
Trained chef: శిక్షణ పొందిన వంటవాడు..
ఆఫ్తాబ్ (Aaftab Amin Poonawala) తాజ్ హోటల్ గ్రూప్ లో శిక్షణ పొందిన వంటవాడు కావడం వల్ల శ్రద్ధ శరీర భాగాలు పాడు కాకుండా ఏం చేయాలో తనకు తెలుసని పోలీసులు కోర్టుకు వివరించారు. హత్యచేసిన తరువాత శ్రద్ధ (Shraddha Walkar) చేతి వేలి నుంచి తీసిన ఉంగరాన్ని తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడని వివరించారు. ఆఫ్తాబ్ తరఫున లీగల్ ఎయిడ్ న్యాయవాది జావెద్ హుస్సేన్, మరో లాయర్ సీమా కుష్వాహ హాజరయ్యారు. వాదనల అనంతరం కేసును మార్చి 20వ తేదీకి వాయిదా వేశారు.