SBI Clerk Prelims Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే..-sbi clerk prelims results 2022 out at sbi co in direct link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sbi Clerk Prelims Results 2022 Out At Sbi Co In Direct Link

SBI Clerk Prelims Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 03, 2023 11:56 AM IST

SBI Clerk Prelims Exam Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. 5,008 పోస్టులకు 2022 నవంబర్‌లో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. నేడు రిజల్ట్స్ వెల్లడయ్యాయి. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

SBI Clerk Prelims Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి..
SBI Clerk Prelims Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి..

SBI Clerk Prelims Exam Results 2022: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేడు (జనవరి 3, 2023) వెల్లడించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో 5,008 ఖాళీల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్‍బీఐ. ప్రిలిమ్స్ పరీక్షను 2022 నవంబర్ 12న నిర్వహించింది. క్లరికల్ క్యాడర్‌లోని జూనియర్ అసొసియేట్ (కస్టమర్ సపోర్ట్& సేల్స్) పోస్టుల కోసం ఈ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఎస్‍బీఐ వెల్లడించింది. ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ప్రాసెసస్ ఇక్కడ చూడండి.

SBI Clerk Prelims Results 2022: ఫలితాలను చెక్ చేసుకోండిలా..

  • ముందుగా బ్రౌజర్‌లో ఎస్‍బీఐ.కో.ఇన్ (sbi.co.in) వెబ్‍సైట్‍కు వెళ్లాలి.
  • అనంతరం వెబ్‍సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.
  • అక్కడ ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమినరీ రిజల్ట్స్ 2022 అనే లింక్ కనిపిస్తుంది.
  • ఆ లింక్‍పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేశాక.. రిజల్ట్స్ స్క్రీన్‍పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఆ రిజల్ట్స్ ను డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ప్రాసెస్ ఇదే

న్యూమరిక్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్‍ల్లో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఈ ప్రిలిమినరీ పరీక్షను ఎస్‍బీఐ నిర్వహించింది. దీంట్లో క్వాలిఫై అయిన వారు ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్‍కు హాజరుకావాలి. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రిజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంశాలపై 190 అబ్జెక్టివ్ ప్రశ్నలతో టెస్టు ఉంటుంది. ఇక మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ఉంటాయి. చివరగా, అన్ని విభాగాల్లో పర్ఫార్మెన్స్‌ను బట్టి అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఈ స్టేజ్‍ల్లో సాధించిన మార్కును బట్టి ఫైనల్ మెరిట్ లిస్టును ఎస్‍బీఐ వెల్లడిస్తుంది.

IPL_Entry_Point