ISRO SSLV : ఎస్​ఎస్​ఎల్​వీ- డీ1 రాకెట్​ విఫలం.. ఇస్రో ప్రకటన-satellites no longer usable after deviation isro on its maiden sslv mission ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro Sslv : ఎస్​ఎస్​ఎల్​వీ- డీ1 రాకెట్​ విఫలం.. ఇస్రో ప్రకటన

ISRO SSLV : ఎస్​ఎస్​ఎల్​వీ- డీ1 రాకెట్​ విఫలం.. ఇస్రో ప్రకటన

Sharath Chitturi HT Telugu
Aug 07, 2022 03:41 PM IST

ISRO SSLV : ఇస్రో ప్రయోగించిన ఎస్​ఎస్​ఎల్​వీ-డీ1 రాకెట్​ లాంచ్​ విఫలమైంది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది.

రాకెట్​ లాంచ్​ విఫలం.. ఇస్రో ప్రకటన
రాకెట్​ లాంచ్​ విఫలం.. ఇస్రో ప్రకటన (ANI )

ISRO SSLV : ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఆదివారం ప్రయోగించిన రాకెట్​ విఫలమైంది. ఎస్​ఎస్​ఎల్​వీ- డీ1 రాకెట్​లోని రెండు ఉపగ్రహాలు.. తాము ఊహించిన దాని కన్నా వేరే ఆర్బిట్​లోకి వెళ్లిందని ఇస్రో ప్రకటించింది. అందువల్ల.. ఈ మిషన్​ లక్ష్యాలు విఫలమయ్యాయని పేర్కొంది. ఫలితంగా.. ఉపగ్రహాలు నిరుపయోగమైనట్టు స్పష్టం చేసింది.

"సమస్యను సహేతుకంగా గుర్తించడం జరిగింది. ఒక సెన్సార్​ పనిచేయకపోవడాన్ని తొలుత గుర్తించలేకపోయాము. అందువల్ల ఉపగ్రాహాలు డీవియేట్​ అయిపోయాయి. ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేశాము. ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేస్తుంది. వాటిని పరిగణలోకి తీసుకుని, ఎస్​ఎస్​ఎల్​వీ-డీ2తో మళ్లీ ముందుకెళతాము," అని ఇస్రో ట్వీట్లు చేసింది.

రాకెట్​ ప్రయోగం చివరి దశలో డేటా కోల్పోయామని ఇస్రో చెప్పిన కొన్ని గంటల తర్వాత.. ఈ ప్రకటన వెలువడింది.

ISRO SSLV mission: ఈ ఎస్​ఎస్​ఎల్​వీలో రెండు ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​లతో పాటు.. ఆజాదీసాట్​ ఉపగ్రహం కూడా ఉంది. ఆజాదీసాట్​ను 'స్పేస్​ కిడ్స్​ ఇండియా'కు చెందిన విద్యార్థుల బృందం రూపొందించింది.

ఈ ఆజాదీసాట్​లో 75 పేలోడ్​లు ఉన్నాయి. వీటిని 750మంది విద్యార్థులు నిర్మించారు. ఆజాదీకా అమృత్​ మహోత్సవాన్ని పురస్కరించుకుని.. విద్యార్థులకు ఇస్రో ఈ అవకాశం ఇచ్చింది. శ్రీహరికోట నుంచి రాకెట్​ లాంచింగ్​ను విద్యార్థినులు వీక్షించారు.

కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి అయింది. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించారు. నాలుగో దశలో సాంకేతిక లోపం తలెత్తినట్టు ఇస్రో పేర్కొంది.

4 దశలు దాటుకొని రాకెట్ వెళ్లింది. టర్మినల్ దశలో కొంత డేటా కోల్పోయింది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 4 వ దశలో సమస్య తలెత్తినట్లు గుర్తించాం. ఉపగ్రహాలు కక్ష్యలోకి వెళ్లాయా లేదా అనే దానిపై విశ్లేషిస్తున్నాం. ప్రయోగం పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తాం’ అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్​ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్