Rakesh Jhunjhunwala stock : రూ. 10వేలను రూ. 53లక్షలు చేసిన స్టాక్​!-rs 4 to rs 2138 rakesh jhunjhunwala stock gives 53 000percent return in 20 years ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rakesh Jhunjhunwala Stock : రూ. 10వేలను రూ. 53లక్షలు చేసిన స్టాక్​!

Rakesh Jhunjhunwala stock : రూ. 10వేలను రూ. 53లక్షలు చేసిన స్టాక్​!

Sharath Chitturi HT Telugu
Jun 10, 2022 08:21 AM IST

Rakesh Jhunjhunwala stock : రాకేష్​ ఝున్​ఝున్​వాలా స్టాక్స్​ను మదుపర్లు ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తూ ఉంటారు. కాగా ఆయన పోర్ట్​ఫోలియోలోని ఓ స్టాక్​.. రూ. 10వేలను రూ. 53లక్షలు చేసి మదుపర్లకు సంతోషాన్ని ఇచ్చింది!

రూ. 10వేలను రూ. 53లక్షలు చేసిన స్టాక్​!
రూ. 10వేలను రూ. 53లక్షలు చేసిన స్టాక్​! (HT Telugu)

Rakesh Jhunjhunwala stock : స్టాక్​ మార్కెట్​లో దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల కలిగే లాభం గురించి నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. 'స్టాక్​ మార్కెట్​ అంటే, కొనడం- అమ్మడం కాదు. మంచి కంపెనీని ఎంచుకుని సాధ్యమైనంత ఎక్కువకాలం హోల్డ్​ చేయాలి,' అని వారెన్​ బఫెట్​ వంటి దిగ్గజ పెట్టుబడిదారులు సూచిస్తూ ఉంటారు. ఇందుకు రాకేష్​ ఝున్​ఝున్​వాలా స్టాక్స్​ మంచి ఉదాహరణ. అందులోనూ 'టైటాన్​' స్టాక్​ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ రాకేష్​ ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియో స్టాక్​​.. 20ఏళ్ల ఏకంగా 53,000శాతం రిటర్నులు ఇచ్చింది!

రెండు దశాబ్దాల క్రితం.. అంటే 2002 జూన్​ 12న.. టైటాన్​ స్టాక్​ రూ. 4.03 వద్ద ఉండేది. కాగా.. 2022 జూన్​ 9వ తేదీకి టైటాన్​ స్టాక్​ రూ. 2,138.35కు చేరింది.

2022లో మాత్రం ఇప్పటివరకు ఈ రాకేష్​ ఝున్​ఝున్​వాలా స్టాక్ నెగిటివ్​గానే ఉంది. దాదాపు 15శాతం నష్టాలను నమోదు చేసింది. స్టాక్​ మార్కెట్​లో ఒడుదొడుకులు, రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి ఇందుకు కారణాలు. కాగా.. ఏడాది కాలంలో ఈ టైటాన్​ స్టాక్​ రూ. 1738 నుంచి రూ. 2138కు పెరిగింది. అంటే అది 23శాతం పెరిగినట్టు. ఐదేళ్లల్లో.. ఈ రాకేష్​ ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియో స్టాక్​.. మల్టీబ్యాగర్​ రిటర్నులు అందించింది. రూ. 516 నుంచి రూ. 2138కు వృద్ధి చెందింది. అది 315శాతం రిటర్నులతో సమానం.

ఇక పదేళ్ల కాలంలో టైటాన్​ స్టాక్​ ధర రూ. 221 నుంచి రూ. 2138కు పెరిగింది. అంటే 870శాతం వృద్ధిని నమోది చేసినట్టు. ఈ లెక్కన.. 20ఏళ్లల్లో ఈ టైటాన్​ స్టాక్​ ఏకంగా 53,000 శాతం పెరిగినట్టు.

రూ. 10,000= రూ. 53లక్షలు..!

Titan share price : రాకేష్​ ఝున్​ఝున్​వాలా స్టాక్​ టైటాన్​ స్టాక్​ చరిత్రను పరిశీలిస్తే.. మదుపర్లకు భారీ రిటర్నులు అందినట్టు స్పష్టమవుతుంది. 5ఏళ్ల క్రితం ఈ టైటాన్​ స్టాక్​లో రూ. 10వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 41,500 అయ్యుండేది. ఇక 10ఏళ్ల ముందు రూ. 10వేలు పెట్టి ఉంటే.. అది కాస్త రూ. 97,000కు చేరేది. అదే విధంగా.. 20ఏళ్ల క్రితం.. ఎవరైనా రూ. 10వేలతో రాకేష్​ ఝున్​ఝున్​వాలా స్టాక్​లో పెట్టుబడి పెట్టి.. ఇప్పటివరకు హోల్డ్​ చేసి ఉంటే.. ఆ మొత్తం కాస్తా రూ. 53లక్షలకు చేరేది!

రాకేష్​ ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియో స్టాక్​..

Rakesh Jhunjhunwala portfolio : రాకేష్​ ఝున్​ఝున్​వాలాకు ఎంతో ఇష్టమైన స్టాక్స్​లో టైటాన్​ ఒకటి. ఆయన పోర్ట్​ఫోలియోకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది ఈ స్టాక్​. కాగా.. రాకేష్​ ఝున్​ఝున్​వాలాతో పాటు ఆయన సతీమణి రేఖకు కూడా టైటాన్​లో వాటాలు ఉన్నాయి. రాకేష్​ ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియోలో టైటాన్​కు చెందిన 3,53,10,395 షేర్లు ఉన్నాయి. రేఖ ఖాతాలో 65,40,575 టైటాన్​ షేర్లు ఉన్నాయి. మొత్తం మీద రాకేష్​ ఝున్​ఝున్​వాలా దంపతుల వద్ద టైటాన్​లో 5.05శాతం వాటా ఉంది.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో పెట్టుబడులు పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

IPL_Entry_Point