Ratan Tata into PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్ లోకి రతన్ టాటా
Ratan Tata into PM CARES Fund: ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది.
Ratan Tata into PM CARES Fund: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కు అజాత శత్రువుగా పేరుంది. సామాజిక సేవలో, సామాజిక సేవా కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడంలో టాటా ముందుంటారు.
Ratan Tata into PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్ లోకి
తాజాగా రతన్ టాటాను పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీల్లో ఒకరుగా నియమించారు. రతన్ టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, మాజీ డెప్యూటీ స్పీకర్ కరియా ముండాలను కూడా ఈ పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా నియమించారు. టాటా సన్స్ చైర్మన్ ఎమిరేటస్ గా రతన్ టాటా కొనసాగుతున్నారు. పీఎం కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీలకు స్వాగతం పలుకుతూ బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Ratan Tata into PM CARES Fund: ప్రధాని సమావేశం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీఎం కేర్స్ ఫండ్ లో కొత్తగా ట్రస్టీలుగా నియమితులైన రతన్ టాటా, జస్టిస్ కేటీ థామస్, కరియా ముండా తో పాటు ఇప్పటికే సభ్యులుగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా హాజరయ్యారు. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై రూపొందిన ఒక ప్రజెంటేషన్ ను వారు వీక్షించారు.
Ratan Tata into PM CARES Fund: సలహా మండలి
మరోవైపు, పీఎం కేర్స్ ఫండ్ సలహా మండలి ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ అడ్వైజరీ బోర్డులో మాజీ కాగ్(Comptroller and Auditor General of India) రాజీవ్ మహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్, రచయిత్రి, సుధా మూర్తి, టీచ్ అండ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరామిల్ ఫౌండేషన్ సీఈఓ ఆనంద్ షా ఉంటారు. కొత్తగా నియమితులైన ట్రస్టీలు, సలహా బోర్డు సభ్యులు పీఎం కేర్స్ ఫండ్ పని తీరును మరింత మెరుగ్గా, సృజనాత్మకంగా మారుస్తారని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు.