Telugu News  /  National International  /  Pune: Woman Forced To Consume Powdered Human Bones To Conceive Child, 7 Booked
 శ్మశానానికి తీసుకెళ్లి.. మహిళ చేత ఎముకల పొడి తినిపించి!
శ్మశానానికి తీసుకెళ్లి.. మహిళ చేత ఎముకల పొడి తినిపించి!

Black magic case : శ్మశానానికి తీసుకెళ్లి.. మహిళ చేత ఎముకల పొడి తినిపించి!

21 January 2023, 7:44 ISTChitturi Eswara Karthikeya Sharath
21 January 2023, 7:44 IST

Black magic case in Pune : పుణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో ఓ మహిళపై ఆమె భర్త, అత్తమామలు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని.. ఆమెను వివిధ శ్మశానాలకు తీసుకెళ్లి, అక్కడ ఉన్న ఎముకల పొడిని తనిపించారు!

Black magic case in Pune : టెక్నాలజీ ఓవైపు పరుగులు తీస్తుంటే.. కొందరి మూఢనమ్మకాలు మాత్రం దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి! పిల్లలు పుట్టడం లేదన్న కారణంగా.. ఓ మహిళపై ఆమె కుటుంబసభ్యులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ తాంత్రికుడి సూచనల మేరకు.. అత్తమాలు, భర్త.. ఆ మహిళలను వివిధ శ్మశానాలకు తీసుకెళ్లి.. అక్కడ ఉన్న ఎముకలు, వాటి పొడిని తినిపించారు!

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగిందంటే..

పుణెలో నివాసముంటున్న ఓ మహిళకు 2019లో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. అత్తమామలకు భయం మొదలైంది. ఈ క్రమంలోనే వారు ఓ తాంత్రికుడిని కలిశారు! అతను చెప్పినట్టు చేశారు.

Pune black magic case : అనేక అమావాస్య సమయాల్లో.. తమ ఇంట్లో మహిళ చేత విచిత్ర పూజలు చేయించారు ఆమె కుటుంబసభ్యులు. అంతేకాకుండా.. వివిధ శ్మశానవాటికలకు తీసుకెళ్లేవారు. మరణించిన మనుషుల ఎముకలను తనిపించేవారు. ఎముకల పొడిని సైతం బాధితురాలి నోట్లో బలవంతంగా పెట్టేవారు! ఇలా చాలాసార్లు జరిగింది. అన్ని సందర్భాల్లోనూ.. ఆ తాంత్రికుడు వీడియో కాల్, ఫోన్​ కాల్​​లో సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొన్ని సందర్భాల్లో మహిళను ఓ జలపాతం వద్దకు తీసుకెళ్లి.. అఘోరీలు చేసే పనులు చేయించారు కూడా.

కట్నం వేధింపులు కూడా..!

అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక పోయిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్​ మేజిక్​తో పాటు అత్తమామలపై వేధింపుల కేసు కూడా వేసింది. కట్నం కింద నగదు, బంగారం, వెండి ఆభరణాలను డిమాండ్​ చేస్తున్నారని పేర్కొంది.

Woman forced to eat dead human bones : ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఏడుగురిపై సెక్షన్​ 498 ఏ, 323, 504, 506తో పాటు యాంటీ సూపర్​స్టీషన్​ యాక్ట్​లోని 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

"ఆ శ్మశానాలు ఎక్కడ ఉన్నాయనేది బాధితురాలికి తెలియదు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని వెతకడం మొదలుపెట్టాము. నిందితులను అతిత్వరలోనే పట్టుకుంటాము. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఈ ఘటనపై ఏసీపీ స్థాయి పోలీసు అధికారి దర్యాప్తు చేపడతారని నేను హామీనిస్తున్నా," అని డీసీపీ శర్మ తెలిపారు.

Maharashtra crime news : పోలీసుల ప్రకారం.. నిందితులు బాగా చదువుకున్న వారే! కానీ ఇలాంటి క్షుద్రపూజలు, తాంత్రిక పూజలపై వారికి ఎక్కువ నమ్మకం ఉండటం గమనార్హం.

ఒక్క మాహారాష్ట్రలోనే కాదు.. దేశవ్యాప్తంగా క్షుద్రపూజలు తరహా ఘటనలు నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ఇవి అత్యంత ఆందోళనకరంగా మారాయి.