OYO IPO : ఐపీఓ కోసం ఓయో సన్నద్ధం.. సెబీ చేతికి కొత్త పత్రాలు!-oyo ipo plans in focus as losses narrow files fresh documents with sebi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Oyo Ipo : ఐపీఓ కోసం ఓయో సన్నద్ధం.. సెబీ చేతికి కొత్త పత్రాలు!

OYO IPO : ఐపీఓ కోసం ఓయో సన్నద్ధం.. సెబీ చేతికి కొత్త పత్రాలు!

Sharath Chitturi HT Telugu
Sep 19, 2022 02:41 PM IST

OYO IPO date : ఓయో ఐపీఓపై స్టాక్​ మార్కెట్​లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా.. ఓయో ఐపీఓపై ఓ అప్డేట్​ వచ్చింది.

ఐపీఓకు సిద్ధంగా ఓయో..!
ఐపీఓకు సిద్ధంగా ఓయో..! (REUTERS)

OYO IPO : ప్రముఖ ట్రావెల్​ టెక్​ సంస్థ ఓయో.. కొంత విరామం తర్వాత మళ్లీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ మేరకు.. సెబీ(సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛైంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా) వద్ద ఇప్పటికే ఉన్న ముసాయిదా పత్రాలకు అదనంగా మరికొన్ని డాక్యుమెంట్లను సోమవారం సబ్మిట్​ చేసింది ఓయో.

OYO profits : నష్టాలు తగ్గాయి..

ఓయో ఐపీఓ కోసం డీఆర్​హెచ్​పీ(డ్రాఫ్ట్​ రెడ్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​).. గతేడాది సెబీ చేతికి అందింది. రూ. 7,000కోట్లు విలువ చేసే షేర్లను ఓపీఓ ద్వారా స్టాక్​ మార్కెట్​లోకి తీసుకురావాలని ఓయో భావించింది. మరో రూ. 1,430కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​ కింద ఇచ్చేందుకు డీఆర్​హెచ్​పీని సెబీకి అందించింది. అయితే.. ఓయో ఐపీఓ వ్యవహారం ఆ తర్వాత ముందుకు సాగలేదు.

OYO IPO news : ఇక ఇప్పుడు.. ఓయో నష్టాలు తగ్గాయి. పర్యాటక రంగం పుంజుకోవడం కూడా ఆ సంస్థకు కలిసి వచ్చింది. ఫలితంగా తాజాగా ఐపీఓ కోసం మరిన్ని ఆర్థికపరమైన పత్రాలను సెబీకి సమర్పించింది ఓయో.

OYO revenue : ఓయో ఆదాయం పెరిగింది!

ఐపీఓకు ప్రణాళికలు రచిస్తున్న ఓయో సంస్థ నష్టం.. 2022 మార్చ్​ నాటికి రూ. 18.9బిలియన్​కు దిగొచ్చింది. ఇక 2020 ఆర్థిక ఏడాదిలో 9.7శాతంగా ఉన్న అడ్జస్టెడ్​ గ్రాస్​ ప్రాఫిట్​ మార్జిన్​.. 2021 నాటికి 33.2శాతానికి చేరింది. 2020 నుంచి 2021 నాటికి ఎబిట్​డా లాస్​ 79శాతం తగింది. ఓయో ఎబిట్​డా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ చరిత్రలోనే తొలిసారిగా సానుకూలంగా నమోదైంది. ఇక 2022 ఆర్థిక ఏడాదిలో.. ఆపరేషన్ల నుంచి ఓయోకు వచ్చే ఆదాయం 21శాతం పెరిగి రూ. 4,781.4కోట్లకు చేరింది. 2021లో అది 3,961.6కోట్లుగా ఉండేది.

OYO IPO SEBI : ఇక ఓయో ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బులను.. అప్పులు తీర్చుకునేందుకు, సంస్థకు సంబంధించిన కార్యకలాపాల కోసం ఖర్చు చేయనున్నట్టు ఆ సంస్థ స్పష్టం చేసింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2023 తొలినాళ్లల్లో ఓయో ఐపీఓ స్టాక్​ మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది.

OYO IPO date : ఓయోను 2012లో రితేశ్​ అగర్వాల్​ స్థాపించారు. ఇండియా, మలేషియా, ఇండోనేషియా, యూరోప్​లో సంస్థను విస్తరించేందుకు యాజమాన్యం ప్రణాళికలు వేసింది. గతంలో అమెరికా, చైనా వంటి ప్రాంతాలపై ఓయో ఫోకస్​ చేసింది. కానీ ఇప్పుడు సంస్థ కార్యకలాపాలను అక్కడ తగ్గించుకుని.. దక్షిణాసియాపై మరింత దృష్టిపెట్టింది ఓయో.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్