BF.7 was reported in India in July: ‘జులై లోనే ఇండియాలో గుర్తించారు.. అయినా..’-omicron sub variant bf 7 was reported in india in july yet no surge of cases experts observe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Omicron Sub Variant Bf.7 Was Reported In India In July, Yet No Surge Of Cases, Experts Observe

BF.7 was reported in India in July: ‘జులై లోనే ఇండియాలో గుర్తించారు.. అయినా..’

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 05:05 PM IST

చైనా లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 ను భారత్ లో జులై నెలలోనే గుర్తించారు. ఆ తరువాత ఇప్పటివరకు మొత్తం ఈ వేరియంట్ కు సంబంధించి 4 కేసులను నిర్దారించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, బ్రెజిల్ దేశాల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.

BF.7 First spotted in July: జులైలోనే తొలిసారి..

చైనా లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7(BF.7) ను భారత్ లో జులై నెలలోనే గుర్తించారు. ఆ తరువాత ఇప్పటివరకు మొత్తం ఈ వేరియంట్ కు సంబంధించి 4 కేసులను నిర్దారించారు. వాటిలో మూడు గుజరాత్ లో, ఒకటి ఒడిశాలో గుర్తించారు. తొలిసారి ఈ BF.7 వేరియంట్ ను గుర్తించి నాలుగు నెలలు గడిచిపోయిన తరువాత.. ఇప్పుడు ఈ వేరియంట్ పై హంగామా చేయడానికి కారణమేంటన్న ప్రశ్న పలువురిలో ఉదయిస్తోంది. చాలా మంది ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందగల బీఎఫ్ 7(BF.7) వేరియంట్ ను దేశంలో గుర్తించి నాలుగు నెలలు గడిచినా.. ఇప్పటివరకు కేసుల(Covid cases) సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి, కేసల సంఖ్య తగ్గుతోందని, ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి స్వయంగా పార్లమెంట్ లోనే చెప్పారని వెల్లడిస్తున్నారు. అకస్మాత్తుగా కరోనాపై భయాందోళనలను పెంచే చర్యలు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Surge in Covid cases: కేసుల సంఖ్య పెరగడం వల్లనే..

అయితే, అంతర్జాతీయంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య(Covid cases) పెరగడం ఇటీవలే ప్రారంభమైందని, అందువల్ల ముందు జాగ్రత్త లో భాగంగా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోందని పలువురు వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బీఎఫ్ 7(BF.7) వేరియంట్ తో ముప్పు లేకునా, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారితో కరోనా ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య(Covid cases) అదుపు చేయలేని స్థితికి చేరిన తరువాత కాకుండా, ముందే, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మేలని సూచిస్తున్నారు.

Bharat jodo yatra: జోడో యాత్రను నిలిపేసేందుకే..

మరోవైపు, దేశంలో కోవిడ్ పరిస్థితిపై(Covid cases) రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర(Bharat jodo yatra) విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, ఆ యాత్రను అడ్డుకోవడం కోసమే, అకస్మాత్తుగా కరోనా BF.7ను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. జులై నెలలోనే కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 దేశంలో గుర్తించారని, అయినా, ఇప్పటివరకు కేసుల(Covid cases) సంఖ్య పెరగలేదన్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ‘‘జులైలో ఈ BF.7 వేరియంట్ ను గర్తించారు. 3 గుజరాత్ లో, 1 ఒడిశాలో గుర్తించారు. రేపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర(Bharat jodo yatra) ఢిల్లీలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు సడెన్ గా కరోనా వేరయింట్ పై భయాందోళనలను పెంచడం ప్రారంభించారు. యాత్ర నిలిపేయాలని కేంద్ర మంత్రి నిన్న రాహుల్ కు లేఖ రాశారు. ప్రధాని మోదీ ఇవ్వాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. ఇదంతా భారత్ జోడో యాత్రను ఆపేసేందుకే అని స్పష్టంగా అర్థమవుతోంది’’ అని జైరాం రమేశ్ విమర్శించారు.

IPL_Entry_Point

టాపిక్