60% population may be infected by Covid: మరో 3 నెలల్లో 60% జనాభాకు కోవిడ్-over 60 population in china may be infected by covid in 90 days top scientist ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Over 60% Population In China May Be Infected By Covid In 90 Days: Top Scientist

60% population may be infected by Covid: మరో 3 నెలల్లో 60% జనాభాకు కోవిడ్

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 03:34 PM IST

Covid surge in China: చైనాలో కరోనా విస్ఫోటనం కొనసాగుతోంది. జీరో కోవిడ్ పాలసీని సడలించడంపై చైనా ప్రభుత్వ ఆందోళన నిజం అవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Covid surge in China: చైనా లో కరోనా కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థితిలో పెరుగుతోంది. కోవిడ్(covid) మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దేశ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో, చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)కి సంబంధించిన పలు ఆంక్షలను సడలించిన విషయం తెలిందే. ఆంక్షలను సడలిస్తే, అదుపు చేయలేని స్థాయికి కోవిడ్(covid) కేసుల సంఖ్య పెరిగే ముప్పు ఉందన్న చైనా ప్రభుత్వ ఆందోళన నిజం అవుతోంది.

Covid surge in China: స్మశాన వాటికల వద్ద రద్దీ

ప్రస్తుతం చైనా(china)లో కరోనా విస్ఫోటనం కొనసాగుతోంది. అనధికారిక వార్తల ప్రకారం.. కరోనా రెండో వేవ్ సమయంలో భారత సహా పలు దేశాల్లో ఏర్పడినటువంటి, భయానక, హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు చైనాలో నెలకొని ఉన్నాయి. కోవిడ్(Covid cases in China) కేసుల సంఖ్య భారీ గా పెరుగుతుండడంతో, ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో కోవిడ్ తో మరణించిన వారి మృతదేహాలను కారిడార్లలో, సెపరేట్ గదుల్లో వరుసగా పేర్చిన దృశ్యాలున్న వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. కోవిడ్ మరణాలు కూడా భారీగా పెరుగుతున్న కారణంగా, స్మశాన వాటికల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన సేవలు అందించే వారికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆంక్షల సడలింపు కారణంగా వైరస్ వ్యాప్తి(Covid cases in China) భారీగా పెరిగింది. నవంబర్ 23 తరువాత చైనా.. తమ దేశంలో చోటు చేసుకుంటున్న కోవిడ్ మరణాల వివరాలను వెల్లడించడం నిలిపేసింది.

60% population may tested positive: 60% జనాభాకు కోవిడ్

రానున్న మూడు నెలల్లో చైనా(china) జనాభాలో 60% మందికి పైగా ప్రజలు కోవిడ్(Covid cases in China) బారిన పడుతారని చైనాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్, హెల్త్ ఎకనమిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ అంచనా వేస్తున్నారు. అలాగే, లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. షాంఘై, బీజింగ్ లలోని ఆసుపత్రుల్లో కోవిడ్(covid) మృతదేహాలను కారిడార్లలో వరుసగా పేర్చిన వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ‘ఇది ప్రారంభం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ‘ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తే నాకేంటి?, ఎవరు చస్తే నాకేంటి’ అన్న తీరున వ్యవహరిస్తోందన్నారు. చైనాలో ఇస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ సినోవాక్ (SinoVac) ఒమిక్రాన్ వేరియంట్స్(Omicron variants) వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోవడం లేదని, SinoVac బలహీన వ్యాక్సిన్ అని ఆయన విమర్శించారు.

IPL_Entry_Point

టాపిక్