Overseas Scholarship: విదేశాల్లో ఉన్నతవిద్యకు స్కాలర్షిప్.. కానీ వీరికి మాత్రమే
National Overseas Scholarship: నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
National Overseas Scholarship: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (Ministry of Social Justice and Empowerment) విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే పేద విద్యార్థులకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) పేరుతో ఏటా స్కాలర్ షిప్ ఇస్తుంటుంది. 2023 సంవత్సరానికి కూడా ఈ స్కాలర్ షిప్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
National Overseas Scholarship: ఆన్ లైన్ లో అప్లై..
2023 సంవత్సరానికి ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) పొందాలనుకునే అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ వారు nosmsje.gov.in. వెబ్ సైట్ ను సందర్శించాలి. నోటిఫికేషన్ లోని నియమ నిబంధనలను పూర్తిగా చదివిన తరువాత, అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవాలి. ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ మార్చి 31.
National Overseas Scholarship: వీరే అర్హులు..
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) అనే కేంద్రం అందించే స్కాలర్ షిప్ స్కీమ్. అల్పాదాయ వర్గాల్లోని విద్యార్థుల విదేశాల్లో ఉన్నత విద్య ఆశయాన్ని తీర్చే లక్ష్యంతో ఈ స్కాలర్ షిప్ ను ఇస్తున్నారు. ఎస్సీ (Scheduled Caste), ఎస్టీ (Scheduled Tribes), డీ నోటిఫైడ్ సంచార జాతులు (Denotified Nomadic Tribes), పాక్షిక సంచార జాతులు (Semi-Nomadic Nomadic Tribes), భూమి లేని వ్యవసాయ కూలీలు (Landless Agricultural Labourers), సంప్రదాయ చేతివృత్తుల్లో (Traditional Artisans) ఉన్న కుటుంబాల్లోని పేద విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో మాస్టర్ కోర్సులు, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు చేయడానికి ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రతీ సంవత్సరం 125 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ఈ స్కాలర్ షిప్ (National Overseas Scholarship NOS) అందిస్తుంది.